అయ్యో పాపం... బ్యూటీఫుల్ బైకర్!
posted on Jul 25, 2024 @ 12:17PM
రష్యాకి చెందిన అమ్మాయి తత్యానా ఓజోలినాకి బైకింగ్ అంటే చాలా ఇష్టం. ఆమె తన బైకింగ్ ద్వారా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారారు. తత్యానా బైక్ ఎక్కి రైడింగ్ చేస్తోందంటే, ఆమె అందాన్ని చూడాలో, ఆమె బైక్ నడిపే స్టైల్‌ని చూడాలో అర్థంకాక తడబడతాం. బ్యూటీఫుల్ బైకర్‌గా సోషల్ మీడియాలో చాలామంది ఫాలోవర్లను సంపాదించుకున్న తత్యానా ఓజోలినా బైక్ ప్రమాదంలో మరణించింది. 38 ఏళ్ళ వయసున్న ఓజోలినా ‘మోటోతాన్యా’ పేరుతో బైక్ రైడింగ్ చేస్తూ వుంటుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 10 లక్షల మంది, యూట్యూబ్ ఖాతాకు 20 లక్షల మంది ఫాలోవర్లు వున్నారు. తన రైడింగ్ సాహసాలతో సోషల్ మీడియాలో లక్షలాది అభిమానులను సంపాదించుకున్న తత్యానా జీవితం చివరికి బైక్ రైడింగ్‌లోనే విషాదాంతం అయింది. టర్కీలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించింది. తత్యానా దగ్గర వున్న రెడ్ కలర్ బీఎండబ్ల్యూ బైక్ చాలా పాపులర్.. ఆమెకి చాలా ఫేవరెట్ బైక్. ఆ బైక్ మీద టర్కీలోని మిలాస్ ప్రాంతంలో ట్రావెల్ చేస్తున్న ఆమె బైక్ మీద నియంత్రణ కోల్పోయింది. ఎదురుగా వస్తున్న ట్రక్కుని బలంగా ఢీకొంది. దాంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. బైక్ మీద ఆమె వెనుకే కూర్చున్న ఒక టర్కీ బైక్ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.