"సీతమ్మ వాకిట్లో..." ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ హైలైట్స్
posted on Jan 21, 2013 @ 5:07PM
"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. ఈ సినిమా ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ హైదరాబాద్ లోని సినీ ప్రముఖులు, చిత్ర యూనిట్ సభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియో ఫంక్షన్ కి మహేష్ బాబు, వెంకటేష్ బాబు కుమారులు అతిధులు గా రాగా, ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ కి సూపర్ స్టార్ కృష్ణ, డా.డి.రామానాయుడు గారు ముఖ్య అతిధులు గా వచ్చారు.
ఈ సందర్భంగా సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ - ''అన్ని రికార్డులు బ్రేక్ చేసిన ఈ సినిమా చూస్తుంటే పూర్వం చక్రపాణిగారు, ఎల్.వి.ప్రసాద్‌గారు తీసిన సినిమాలు గుర్తొచ్చాయి. వెంకటేష్, మహేష్ అన్నదమ్ములుగా చూడముచ్చటగా కనిపించారు. హీరోల చుట్టూ కథ అల్లకుండా ఒక కుటుంబం, ఆ కుటుంబంలోని ఇద్దరు అన్నదమ్ముల చుట్టూ జరిగే కథతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు.
ఈ చిత్రానికి ఇంత పెద్ద విజయాన్ని చేకూర్చిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా కలెక్షన్ల పరంగా 81 సంవత్సరాల తెలుగు సినిమా రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా పాటలు మళ్ళీ మళ్ళీ వినేలా వున్నాయి. ఇంకా ఈ సినిమా పెద్ద రన్ వచ్చి 100 డేస్ ఫంక్షన్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
డి.రామానాయుడు మాట్లాడుతూ - ''ఈ సినిమా ఇంత పెద్ద కావడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. దిల్‌రాజుగారు టాప్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరుగా నిలిచారు. ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు దిల్‌రాజుగారు నిర్మించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.