Read more!

వివేకా హత్యకేసు సాగదీత ఇంకెంత కాలం.. సుప్రీం

వివేకా హత్య కేసు దర్యాప్తులో జాప్యంపై సుప్రీం కోర్టు సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును ఇంకెంత కాలం సాగదీస్తారని ప్రశ్నించింది. కేసు మొత్తం రాజకీయ దురుద్దేశంతో కూడినదేనంటూ రిపోర్టు రాశారంటూ పేర్కొన్న సుప్రీం కోర్టు, హత్యకు ప్రధాన కారణాలు, ఉద్దేశాలు బయటపెట్టాలని ఆదేశించింది.

అంతే కాకుండా అవసరమైతే విచారణాధికారిని మార్చండి, మరో అధికారిని నియమించండి అని పేర్కొంది. అయితే ఇప్పుడు ఉన్న అధికారిని మార్చాలన్నది తమ ఉద్దేశం కాదనీ, ఆయనా కొనసాగుతారనీ పేర్కొంది. సీబీఐ ఇచ్చిన సీల్డ్ కవర్ నివేదిక మొత్తం చదివామని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం ఆ నివేదిక ఆధారంగా ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టం చేసింది.

కేసు దర్యాప్తు వేగవంతం విషయంలో సీబీఐ డైరెక్టర్ నుంచి ఆదేశాలు తీసుకోవాలని ఆదేశిస్తే ఈ నెల 29కి విచారణను వాయిదా వేసింది.