సన్నీలియోన్ పాపకు ఇంకా ట్రెయినింగు కావాలిట!
posted on Jan 9, 2013 @ 4:53PM
నీలిచిత్రాల సుందరి సన్నీ లియోన్ ఏ ముహుర్తాన్నమనదేశంలో కాలు పెట్టిందో గానీ, నాటి నుండి మరి వెనుతిరిగి చూసుకోవలసిన అవసరమే పడలేదు ఆమెకు. ఒక ప్రైవేట్ హిందీ చానెల్ వాళ్ళు రెండు సం.ల క్రితం నిర్వహించిన ‘బిగ్ బ్రదర్’ రియాల్టీ షోలో పాల్గొన్న ఆమెకు బాలీవుడ్ రెడ్-కార్పెట్ పరిచి మరీ స్వాగతించింది. బహుశః ఆమె అప్పటికే నీలి చిత్రాలలో చాలా అనుభవం సంపాదించుకొని ఉందిగనుక, బాలీవుడ్ అవసరానికన్నా ఎక్కువే ఆమె నుండి పొందవచ్చుననే ఆశతో స్వాగతించినందుకు, సన్నీపాప కూడా వారిని ఎన్నడూ నిరాశాపరచకుండా అడిగినంతా అందాలు ప్రదర్శన చేస్తోంది.
మొదట ప్రజలు ‘అటువంటి పిల్లతో సినిమాలా’ అంటూ బుగ్గలు నొక్కుకోన్నపటికీ, ఆ తరువాత ఆమె బయటపెట్టిన తన అందాలకు దాసోహం అనక తప్పలేదు. ఆమె మొదటి సినిమా 'రాగిణి యం యం.యస్.' లో ఆమె అందాలకు దాసోహమన్న బాలీవుడ్ వెంటనే జిస్మ్-2 తో ఆమె నగ్న అందాలను దాదాపు తడిపి ఆరేసేసింది. నీలి చిత్రాలలో పడే శారీరిక శ్రమతో పోలిస్తే బాలీవుడ్ సినిమాలలో నటించడమే ఆమెకు తేలికగా కన్పించడమే గాకుండా,ఎన్ని నీలి చిత్రాలలో చేసినా రాని పేరు, సంపాదించలేని డబ్బు, పాపులారిటీ అన్నీకూడా కేవలం రెండే రెండు సినిమాలతో వచ్చి ఆమె ఒంటి మీద నిలవని కొంగులోపడటం, ప్రజలు, మీడియా రెండూ కూడా బ్రహ్మ రధం పట్టడం చూసిన నీలి చిత్రాల అందాల సుందరి లియోన్, ఇక బాలీవుడ్ లోనే ఉండి పోవలనుకొంటున్నట్లు ప్రకటించడంతో ఆమెనే నమ్ముకొని బ్రతుకుతున్న నిర్మాతలు, ఆమె అభిమానులు అందరూ కూడా మహదానంద పడిపోయేరు.
ఇటీవలే, ఆమెకు మరో హిందీ సినిమా ఆఫరు కూడా వచ్చింది. అది కూడా తానూ చేసిన ‘రాగిణి యం .యం.యస్.’సినిమాకి సీక్వెల్ కావడంతో తన పాపులారిటీకి తానే మురిసిపోయింది సన్నీ పాప. అయితే, రెండు హిందీ చిత్రాలలో ఒళ్ళు చూపించి ఎలాగో నెట్టుకొచ్చేసినా, చాలా నీలి చిత్రాలలో నటించిన అనుభవం తనకి ఉన్నపటికీ, బాలీవుడ్ సినిమాలకి పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నట్లు ఆమె భావించి, అదే విషయాన్నీతన కొత్త సినిమా దర్శకుడు భూషణ్ పటేల్ కు చెప్పి అతని సాయం కోరింది భారీ అందాలు భారంగా మోసుకు తిరుగుతున్న సన్నీపాప. కానీ, ఆమె అభిమానులు, దర్శక నిర్మాతలు అందరూ కూడా ఆమె నుండి కోరుకొంటున్నది నటన కాదని ఆమెకు ఎవరూ చెప్పలేదు.
అటువంటి అనుభవజ్నురాలయిన శిష్యురాలు దొరకడమే తన అదృష్టంగా భావించిన దర్శకుడు భూషణ్ కూడా శ్రమ అనుకోకుండా తనకు తెలిసినవి ఆమెకు నేర్పిస్తూ, ఆమెకు తెలిసినవి తానూ నేర్చుకొంటున్నాడని బాలివుడ్ సమాచారం. మరి మన తెలుగు నిర్మాతలు దర్శకులు ఆమె గురించి ఇంకా ఆలోచించినట్లు లేదు.