సుజయకృష్ణ టీడీపీ ఎంట్రీ వాయిదా.. చంద్రబాబు పుట్టినరోజున..
posted on Apr 16, 2016 @ 1:03PM
వైసీపీ బొబ్బిలి ఎమ్మెల్యే వెంకట సుజయకృష్ణ రంగారావు టీడీపీ లో చేరుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన చేరికను ప్రస్తుతం వాయిదా వేసి చంద్రబాబు పుట్టినరోజు అంటే ఈ నెల 20 వ తేదీకు పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 మధ్యలో తన సోదరుడు బేబినాయనతో కలిసి సుజయ్ విజయవాడలో టీడీపీలో చేరుతారు. ప్రస్తుతానికి సుజయ్ ఒక్కరే టీడీపీలో చేరుతున్నారు. భవిష్యతలో మరికొందరు వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లే ఆస్కారం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
మరోవైపు సుజనా ఎంట్రీ వల్ల కొంతమంది టీడీపీ నేతల్లో ఆసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే సుజయ్‌కు మంత్రి పదవితోపాటు సోదరుడు బేబీనాయనకు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు బేరం కుదిరింది. దీంతో బొబ్బిలిరాజులు పసుపు కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ నియోజక వర్గంలో ఇంత వరకు రాజులకు వ్యతిరేకంగా పనిచేసిన నాయకులు, కార్యకర్తలు అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.