బీటెక్ విద్యార్థిని సూసైడ్..
posted on Jul 23, 2021 @ 10:25AM
చదువుకునే పరిస్థితి పోయింది.. చదువునుకొనే పరిస్థితి వచ్చింది.. ఉన్నోడికి చదువు.. లేనోడికి లేదిక బతుకుదెరువు.. ప్రభుత్వాల చేతగాని తనం ప్రైవేట్ సంస్థలకు ఆసరాగా మారింది.. వాళ్లకు ఇష్టమొచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నారు.. ఫీజులు కట్టని వాళ్ళను వేధిస్తున్నారు.. ముందు మా కాలేజీ లో చేరండి అని వల్లే విద్యార్థులు దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ కాలేజీ లో జాయిన్ అయ్యాక విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రైవేట్ కాలేజెస్ యాజమాన్యం కూడా రాజకీయ నాయకుల బాట నడుస్తున్నారు. ఎన్నికల ముందు రాజకీయ నాయకులూ వాగ్దానాలు చేసినట్లు.. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యం కూడా వాగ్దానాలు చేస్తున్నారు. చివరికి విద్యార్థులను ఫీజులు కట్టాలని వేధిస్తున్నారు. తాజాగా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోడిమెట్ల ప్రిన్స్‌స్టన్ కళాశాల యాజమాన్యం వేధింపులు భరించలేక విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. ఫీజు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం ఒత్తిడికి చేయడంతో లావణ్య(18).. ఫీజు చెల్లించలేక, తల్లితండ్రులకు భారం కాలేక సెల్ఫీ వీడియో తీసుకొని, ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం.. వనపర్తి గాంధీ నగర్‌కు చెందిన లావణ్య.. ఘాట్‌కేసర్‌లోని ప్రిన్స్‌స్టన్ ఇంజనీరింగ్ మహిళ కళాశాలలో ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతోంది. తండ్రి వృత్తి రీత్యా వాచ్ మెన్, తల్లి దినసరి కూలిగా పని చేస్తూ వాళ్ళ జీవితం వెల్లడిస్తున్నారు. అయితే చాలీచాలని జీవితాలు వాళ్ళవి అయితే, కళాశాల యాజమాన్యం ఫీజు కట్టాలని వేధింపులకు గురిచేయడంతో 25వేల ఫీజు చెల్లించలేక.. మసస్తాపంతో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కళాశాల ముందు విద్యార్ధి సంఘాలు ధర్నా
లావణ్య ఆత్మహత్యకు కారణమైన ప్రిన్స్‌స్టన్ కళాశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గురువారం విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో కళాశాల ముందు ధర్నాకి దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కళాశాలకు చేరుకొని సమస్యను పరిష్కరించారు. ప్రైవేట్ కాలేజీ ఫీజులు నియంత్రణలు ఉంచాలని.. లావణ్యకు జరిగిన అన్యాయం మరో విద్యార్థికి జరగకూడదని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేశాయి.
భార్య, కూతురిని నరికి చంపిన కిరాతకుడు..
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యతో పాటు కన్న కూతురిని ఓ కిరాతకుడు గొడ్డలితో నరికి చంపాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బోధన్ మండలం పెద్ద మావందికి చెందిన మల్లీశ్వరితో రుద్రూర్‌కు చెందిన గంగాధర్‌తో వివాహం జరిగింది. వీరికి రుత్విక అనే(13)ఏళ్ల కూతురు ఉంది. గంగాధర్ గత కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నదని భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఇటీవల పెద్దల సమక్షంలో పంచాయతీ సైతం జరిగింది. అయినా గంగాధర్ అనుమానంతో గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భార్య మల్లీశ్వరి(30), కూతురు రుత్విక (13)ని దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం రుద్రూర్ పోలీస్ స్టేషన్‌కి వచ్చి లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని రుద్రూర్ సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ రవీందర్‌లు పరిశీలించి కేసు నమోదు చేశారు.