శ్రీశైలం మల్లన్న హుండీ దొంగ అరెస్ట్.. నగదు స్వాధీనం
posted on Aug 2, 2025 @ 10:15AM
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానంలో హుండీ చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి లక్షా 24 వేల 200 రూపాయలను రికవర్ చేశారు. దేవస్థానంలో కాంట్రాక్ట్ పరిచారక విధులలో ఉండే విద్యాథర్ ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. జూన్ 16 తెల్లవారుజామున స్వామివారి గర్భాలయం ముందు ఉన్న క్లాత్ హుండీ నుంచి 24 వేలు దొంగతనం చేసి పరారీలో ఉన్న విద్యాధర్ ను శ్రీశైలం ఒకటో పట్టణ పోలీస్ అధికారులు శుక్రవారం (ఆగస్టు 1) అరెస్ట్ చేశారు.
అనంతరం పోలీసుల విచారణలో మల్లికార్జున స్వామి వారి హుండీని అవసరానికి డబ్బించే అడ్డాగా మార్చుకున్న విద్యాథర్ ఇప్పటి వరకూ 12 స్వార్లు స్వామి వారి హుండీలో చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. ఆ చోరీ సొమ్ముతో బైక్ కొని, లక్ష రూపాయలు పెట్టి తన ఇంటికి మరమ్మతులు చేయించినట్లు కూడా తెలిపారు. రెండేళ్ల వ్యవధిలో మల్లన్న హుండీ నుంచి విడతల వారీగా 3 లక్షల 79 వేల 200 రూపాయల సొమ్మును చోరీ చేసినట్లు అంగీకరించాడు. నిందితుడు ఖర్చు చేయగా అతని వద్ద మిగిలిన సొత్తు లక్షా 24 వేల 200 రూపాయలను పోలీసులు రివకర్ చేశారు. అలాగే నిందితుడి నుంచి నిందితుడు ఖర్చు చేయగా మిగిలిన 1,24,200 రూపాయలను రికవరీ చేయడంతో పాటు, బైక్ను స్వాధీనం చేసుకుని నిందితుడిని ఆత్మకూరు కోర్టులో హాజరు పరిచారు.