బెడిసిన శ్రీరెడ్డి, జగన్ బంధం.. బట్టబయలు చేసిన వీడియో
posted on Jun 13, 2022 @ 12:36PM
ఒక పార్టీకో, ఒక నాయకునికో వీరాభిమానులు వుంటారు. జీవితాంతం అలాగే వుండేవారూ వుంటారు, వున్నారు. కానీ వీరాభిమానం కూడా ఒక్కోసారి వీర విరోధంగా మారిపోతుంది. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సంఘటనతో వీరాభిమానం కాస్తా నీరుగారి పోతుందా? అంటే ఔననే చెప్పాలి. అందుకు మరో సాక్ష్యం సినీ నటి శ్రీరెడ్డి! తాను ఆశించినది,
తాను భక్తితో ఆరాధిస్తున్నవారు అందించేందుకు ముందుకు రాకపోతే.. తన డిమాండ్ ను అస్సలు పట్టించుకోకుంటే మరి వీరాభిమానం కాస్తా దెబ్బతినక మానదు. తనకు చాలా అన్యాయం జరిగిందని గొగ్గోలు పెట్టడం ఆరంభ మవుతుంది. ఏదయినా తనదాకా వస్తేగాని తెలియదన్నది శ్రీరెడ్డి కీ తెలిసొచ్చింది.
విషయమేమంటే.. ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి శ్రీ రెడ్డి జగన్ కు ఆయన పార్టీకీ వీరాభిమానిగా మారారు. గతంలో ఎన్నడూ ఎవ్వరూ చేయనంత గొప్పగా పాలన సాగిస్తున్నారం టూ జగన్ ను పొగడ్తలతో ముంచెత్తేయడం , జగన్ సర్కార్ పై విమర్శించే విపక్షాల వారిని దుమ్మెత్తి పోయడంలో ఆమె తర్వాతనే ఎవరయినా అనే స్థాయికి ఎదిగారు శ్రీరెడ్డి. నటిగా ఆమె కు జరిగిన అన్యాయాలను లోకానికి తెలియజేయడంలో గతంలో ఆమె చేపట్టిన కార్యక్రమాలన్నీ సంచలనమే, వివాదాస్పదమే. రాజకీయాలలో కూడా విపక్షంపై ఆమె విమర్శలు కూడా వివాదాలకు నెలవుగానే ఉండేవి. అనేకానేక సందర్భాల్లో విపక్షాలవారిపైనా భారీ ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేసేరు. మనసులో మాట చెప్పడం వేరు, ఆక్రోశం వ్యక్తం చేయడం వేరు. కానీ శ్రీరెడ్డి ఏ విషయమమైనా కూడా తనదయిన ప్రత్యేక స్టయిల్‌లోనే చెబుతారనీ, ఆ విషయంలో అమెది అనితర సాధ్యమైన శైలి అని అంతా అంగీకరిస్తారు.
కొందరికి నిత్యం సామాజిక మాధ్యమాల్లో ఏదో ఒక విషయంలో సంచనాలు వివాదాలతో రెచ్చిపోవడం ఒక సరదాగా మారింది. అదో చిత్రమయిన వ్యాపకం. ఇందుకు శ్రీరెడ్డి మినహాయింపు కాదు. విడదల రజనికి వైద్య ఆరోగ్యశాఖ అప్పగించడం మీద తన పద్ధతిలో అభిప్రాయం వ్యక్తం చేసింది. తాజాగా ఆమె సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు రాజకీయ రచ్చకు తెరలేపింది.
నిత్యం వైసీపీ వారిని భజన చేస్తుండే శ్రీరెడ్డి హఠాత్తుగా అదంతా హుళక్కి అన్నట్టుగా ఒక వీడియో చేసిం ది. శ్రీరెడ్డి తన స్నేహితులతోనో, బంధువులతోనో కలిసి ఒక వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణానికి పూనుకుంది. గుడి నిర్మాణం తన వల్ల కావడం లేదని ప్రభుత్వ సహాయం అర్దిస్తే ఇంతవరకూ ఎలాంటి మాట సహాయం కూడా లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. వైసీపీ పార్టీని నమ్ముకున్నవారికి ఎంతో మేలు జరుగుతుందని ఎంతో ప్రచారం జరిగింది. కానీ అదంతా అవాస్తవం అన్నది శ్రీరెడ్డికి తన వంతువచ్చే సరికి తేటతెల్లమయింది.
తను అనుకున్న గుడి నిర్మాణం పనులకు ఆర్ధిక సాయం కోసం అనేక పర్యాయాలు అధికారుల చట్టూ ప్రదక్షి ణం చేసినా ఫలితం శూన్యం. ఇదే కాదు అనేక సందర్భాల్లో కూడా తాను ఆశించిన సాయం ప్రభుత్వం నుంచి అందలేదని తెగ బాధపడుతోందామె. పొగడ్తలతో నొరు నొప్పి పుట్టడమే తప్ప తనకు ప్రత్యేకించి ఒరిగిందేమీ లేదు. అసలే పరిస్థితులు బాగాలేకుంటే శ్రీరెడ్డి గోడు వైసీపీ పట్టించుకుంటుందా? ఎంతో మందిని సహాయం అర్ధించినా తిరస్కరణకే గురయిందిట. ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో ఆవేదనకు గురయింది నటి శ్రీరెడ్డి. అయితే సీఎం జగన్ తన పాలన మహాద్భుతంగా సాగుతోందని, గతంలో కంటే ప్రజలకు మేలు జరుగుతోందని, పథకాల అమలు సవ్యంగా జరుగుతోందని తెగ ప్రచారం చేసుకున్నారు.
ఎవరికి ఎలాంటి సహాయం అందించడం లో నయినా వెనుకాడమని ప్రజలకు మేలు చేయడంలో తనకు మించిన వారు లేరనీ చేసిన జగన్ ప్రసంగం తాలూకు వీడియోను,దాని కిందే కౌంటర్ ఇస్తూ సామాజిక మాధ్యమంలో శ్రీరెడ్డి పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తే ఇలా కాక మరెలా ఉంటుంది అంటూ ఆమె పోస్టుకు నెటిజన్లు స్పందిస్తున్నారు.