విడదల రజిని మీద శ్రీరెడ్డి బూతు పురాణం!
posted on Jun 11, 2024 @ 1:22PM
ఇంతకాలం తెలుగుదేశం, జనసేన నాయకుల మీద బూతుపురాణం విప్పుతూ, అందరూ చెవుల్లో దూది పెట్టుకోవాల్సిన పరిస్థితి తెచ్చిన అచ్చతెలుగు మహిళామణి శ్రీరెడ్డి ఇప్పుడు వైసీపీ నాయకుల మీద తన ప్రతాపం చూపిస్తోంది. ఈ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి గెలిస్తే వైజాగ్ బీచ్‌లో బట్టలు విప్పుకుని తిరుగుతానని గతంలో శ్రీరెడ్డి ప్రకటించింది. కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో వైజాగ్ బీచ్‌ల్లో కుర్రకారు శ్రీరెడ్డి ఎప్పుడు వస్తుందా... తాను చెప్పిన విప్పుడు కార్యక్రమం ఎప్పుడు చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. కానీ, తాను చెప్పిన విప్పుడు కార్యక్రమాన్ని పక్కన పెట్టి, తన సొంత పార్టీ అయిన వైసీపీ నాయకుల మీదే బూతుపురాణం విప్పుతోంది. వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి సోషల్ మీడియాలో శ్రీరెడ్డి కారం తిన్న కాకిలా అరుస్తోంది. ఎందుకు అరుస్తోందో, ఎవరిని తిడుతోందో ఎవరికీ అర్థంకాని పరిస్థితి. లేటెస్ట్.గా శ్రీరెడ్డి సైబరాబాద్ మొక్క విడదల రజినిని టార్గెట్ చేసింది. విడదల రజని మీద బూతులు ప్రయోగిస్తూ రెచ్చిపోయింది. వైసీపీ ఈ ఎన్నికలలో ఓడిపోవడానికి విడదల రజని కూడా ఒక కారణం అని శ్రీరెడ్డి ఆరోపించింది. విడదల రజనిని ఎంకరేజ్ చేయొద్దురా మొర్రో తాను ఎప్పటినుంచో చెబుతున్నా వినలేదని శ్రీరెడ్డి బాధపడిపోయింది. అక్కడితో ఆగకుండా.. విడదల రజనిని అనకూడని మాట కూడా అనేసింది.. విడదల రజిని ఒక ‘వ్యాంప్’ అనేసింది. వామ్మో... మరీ ఇంతలా తిట్టాల్సినంత మేటర్ ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏంటో! ఇప్పుడు శ్రీరెడ్డి బూతుపురాణం మీద విడదల రజిని ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..