చెత్త కోసం.. అతను సైతం..
posted on Mar 25, 2021 @ 12:25PM
ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని అనుకుంటే తప్పు. మన సమస్యల కోసం మనమే గళం విప్పాలి. కానీ కొందరు మాత్రం అలా అనుకోరు ఆ సమస్య ఏదైనా దానిపైన వారి సంతకం ఉండాలనుకుంటారు . వ్యక్తులు అలాంటి వారే సమస్యలపై తన నినాదపు గళాలు వినిపిస్తారు. తాజాగా హైదరాబాద్ లో ఓ కార్పొరేటర్ భర్త స్థానికంగా ఉన్న సమస్యపై తన స్థానికులతో కలిసి తన గళం వినిపించారు. సమస్య పరిష్కారానికి మార్గం వేశారు.
బేగంపేట లో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది.. చెత్త కుప్పలు తొలగించడం లేదు.. ఓట్లు వేసి గెలిపిస్తే సమస్యను పట్టించుకోరా అంటూ రెండు రోజుల క్రితం పాదయాత్రకు వచ్చిన సోమాజిగూడ కార్పొరేటర్, అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ డిప్యూటీ కమిషనర్‌తో కలిసి మంగళవారం బీఎస్ మక్తాలో పర్యటించారు. వారం రోజులుగా చెత్త తొలగించకపోవడంతో డంపింగ్ యార్డుగా మారిందని డిప్యూటీ కమిషనర్‌కు వారు వివరించడంతో సమస్య తీరినట్టే అనుకున్నారు.
ఆ ప్రాంతానికి కార్పొరేటర్ భర్త వనం శ్రీనివాస్‌యాదవ్ తన అనుచరులతో వెళ్లి అక్కడే ఉన్న చెత్త మధ్యలో స్టూల్ వేసుకుని అక్కడే కూర్చొని నిరసన తెలిపారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌తోపాటు జీహెచ్‌ఎంసీ అధికారులకు విషయం చేరింది. కార్పొరేటర్ భర్త శ్రీనివా్‌సయాదవ్ ఎంఎస్ మక్తాలో నిరసన తెలుపుతున్నారనే విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయింది. స్పందించిన శానిటేషన్ అధికారులు బుధవారం మధ్యాహ్నం చెత్తను తొలగించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో కూడా శానిటేషన్ సమస్య తీవ్రంగా ఉందని. కరోనా విజృంభిస్తున్న తరుణంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ఇలా అంటి ముట్టనట్లు ఉండడం సరి కాదని ఆయన అన్నారు