రోగాల పుట్ట జగన్!
posted on Jun 12, 2024 @ 4:39PM
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే చాలా రకాల వ్యాధులు వున్నాయని అంటూ వుంటారు. ముఖ్యంగా ఆయనకి మానసిక సమస్యలు చాలా వున్నాయని అంటూ వుంటారు. ఆ మెంటల్ ప్రాబ్లమ్స్ కోసం మందులు లండన్ నుంచి వస్తూ వుంటాయని, మొన్నామధ్య ఎలక్షన్లు అయిపోగానే లండన్‌కి వెళ్ళడానికి మెంటల్ ట్రీట్‌మెంట్ కూడా ఒక కారణమని చాలామంది అన్నారు. జగనన్నకి తనలో తాను మాట్లాడుకునే వ్యాధి వుంది. ఈ వ్యాధి లక్షణాలను చాలాసార్లు చూశాం. ఇక బీపీ వుందన్న విషయం ఎవరూ చెప్పకుండానే తెలిసిపోతూ వుంటుంది. ప్రతిపక్షంలో వున్నా, అధికారంలో వున్నా అసెంబ్లీ సమావేశాల సమయంలో అన్నగారి బీపీని తెలుగువాళ్ళందరూ ఆల్రెడీ చూశారు. కాబట్టి, జగన్‌కి హైబీపీ వుంది అనడంలో ఎలాంటి డౌటూ అవసరం లేదు. బీపీ అంత రేంజ్‌లో వుంది కాబట్టి అల్సర్ కూడా వుండే వుంటుంది. అలాగే, సొంతపార్టీ ఎమ్మెల్యేలతో సహా ఎవర్నీ దగ్గరకి రానివ్వరు... ఎవరితోనూ కలవరు కాబట్టి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పుష్కలంగా వుందని అర్థం చేసుకోవచ్చు. దీనికి పూర్తి రివర్స్జ.లో వుండే సుపీరియారిటీ కాంప్లెక్స్ కూడా జగన్ దగ్గర భారీగానే వుందని తెలుస్తూనే వుంటుంది. రెండు కాంప్లెక్సులూ ఒకే మనిషిలో ఈ రేంజ్‌లో వుండటం వైద్య శాస్త్రంలోనే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అలాగే జగన్‌కి లేనిది ఉన్నట్టు ఊహించుకునే వ్యాధి కూడా వుంది. అందర్నీ శత్రువుగా చూసే మానసిక వైకల్యం వుంది. అదేవిధంగా, జగన్‌కి ‘నార్సీ’ అనే మానసిక వ్యాధి వుందని చంద్రబాబునాయుడు కూడా చెప్పారు. తానే ఉన్నత స్థానంలో వుండాలి... మిగతావాళ్ళందరూ నాకంటే తక్కువ స్థాయిలో వుండాలి... ఎవర్నయినా సరే సామ, దాన, భేద, దండోపాయాలతో లొంగదీసుకోవాలి... ఇవన్నీ ‘నార్సీ’ మానసిక వ్యాధి లక్షణం. ఈ వ్యాధి అయితే జగన్‌లో టన్నులకు టన్నులు వుంది.
ఇక జగన్‌కి భవిష్యత్తులో రాబోయే రోగాలు ఏమిటన్నది పరిశీలిస్తే, జగన్ తన తాడేపల్లి ప్యాలెస్‌ని వదిలిపెట్టి బయటకి రావడం లేదు కాబట్టి ఎండ తగలకపోవడం వల్ల విటమిన్ ‘డి’ లోపం వచ్చే అవకాశం వుంది. దాని వల్ల ఎముకలు బలహీనం అయిపోయి కేసీఆర్‌కి విరిగినట్టుగా ఏ తుంటో విరిగే ప్రమాదం వుంది. ఇంట్లో కూర్చోవడమే తప్ప చేసే పనేమీ లేదు కాబట్టి ఊబకాయం వచ్చేసే అవకాశం వుంది. తద్వారా మోకాళ్ళ కీళ్ళు అరిగిపోయే అవకాశం వుంది. పనిలోపనిగా సుగర్ కూడా ఎటాక్ అయ్యే అవకాశం వుంది. ఎక్కువ సేపు కూర్చునే వుండటం వల్ల చెప్పుకోలేని చోట కూడా వ్యాధి వచ్చే ఛాన్సు వుంది. కాబట్టి... జగన్ తాడేపల్లి ప్యాలెస్‌ని వదిలిపెట్టి జనంలోకి వస్తూ వుంటే, పాత వ్యాధుల సంగతేమోగానీ, కొత్త రోగాలు రాకుండా వుంటాయి!