ఇన్ హేలర్ లో పాము..
posted on Mar 10, 2021 @ 10:01AM
పాములు పుట్టలో ఉండడం సహజం. పొలాల్లో తిరగడం ప్రకృతి సహజం, అప్పుడపుడు పెరట్లో , కొన్నీ సార్లు ఇంట్లో కూడా దర్శనం ఇస్తూ అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఇలా వివిధ ప్రదేశాల్లో పాములు తలదాచుకున్న వార్తలను చదివాం. కానీ మనం ఊహించని చోట పాములు దర్శనము ఇస్తే మనిషి ఎలా ఫీల్ అవుతాడో తెలుసా..తాజాగా ఒక పాము ఇన్ హేలర్ లో తల దాచుకుంది. బహుశా అదే తన అమ్మ వడి అనుకుందేమో మరి. ఇన్ హేలర్ లో పాము తలదాచుకోవడం ఏంటని అనుకుంటున్నా. మీరే చదవండి ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన యువతికి ఆస్తమా ఉండటంతో ఆమె ఇన్‌హెలర్‌ను ఉపయోగిస్తోంది. ఇన్‌హెలర్‌ను వాడి పక్కన పెట్టిన సమయంలో ఎటునుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ పాము పిల్ల వచ్చి ఇన్ హేలర్ లోపలకు దూరింది.
పామును యువతి సరైన సమయంలోనే గుర్తించడంతో ఆమెకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. పామును చూసిన వెంటనే యువతి పాములు పట్టేవారికి సమాచారం ఇవ్వడంతో వాళ్లొచ్చి పామును పట్టుకున్నారు. పాము పిల్ల చిన్నదే అయినప్పటికి దాని విషం చాలా ప్రమాదకరమని వారు తెలిపారు. తాము ఇప్పటివరకు ఇళ్లలో అనేక చోట్ల పాములను చూశాం కానీఇన్ హేలర్ లోపల పాము పిల్లను చూడటం ఇదే మొదటిసారి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.