నల్లధనంపై మోడీ స్పెషల్ టీమ్
posted on May 28, 2014 @ 11:46AM
ప్రధాని నరేంద్ర మోడీ పదవీ బాధ్యతలు స్వీకరి౦చిన తొలి రోజే తన మార్కును ప్రదర్శించారు. మోడీ టీమ్ తొలిరోజే కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు సూచనల మేరకు విదేశాల్లో ఉన్న భారతీయుల నల్లధనంపై దర్యాప్తు కోసం విశ్రాంత న్యాయమూర్తి ఎంబీ షా నేతత్వంలో ప్రత్యేక దర్యాప్తు బందం(సిట్)ను ఏర్పాటు చేసింది. వైస్‌చైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అర్జిత్ పసాయత్‌ను నియమించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరక్టర్ జనరల్, రెవెన్యూ కార్యదర్శి, సీబీఐ, రా, ఈడీ డైరెక్టర్లు, సీబీడీటీ చైర్మన్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌లను సిట్ సభ్యులుగా నియమించారు. క్యాబినెట్ భేటీలో ప్రధానంగా రెండు అంశాలపైనే చర్చించామని మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సిట్ ఏర్పాటుతోపాటు గోరఖ్‌ధామ్ రైలు ప్రమాదంపై చర్చించామన్నారు. నల్లధనం వ్యవహారంలో కేంద్రం నిబద్ధతకు సిట్ ఏర్పాటే నిదర్శనమని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. సుప్రీంకోర్టు విధించిన గడువు బుధవారంతో ముగుస్తుండటంతో తొలిసమావేశంలోనే సిట్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. రైలు ప్రమాదాలకు సంబంధించి పూర్తి స్థాయిలో బుధవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో ఉన్నత స్థాయి సమీక్ష జరపనున్నట్లు ఆయన తెలిపారు.