సింహాచలం దుర్ఘటన మృతుల గుర్తింపు
posted on Apr 30, 2025 @ 12:18PM
సింహాచలం చందనోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న అపశ్రుతిలో మృతులను గుర్తించారు. వారి వివరాలను అధికారికంగా ప్రకటించారు. మృతుల వివరాలిలా ఉన్నాయి.
కోనసీమ జిల్లాకు చెందిన కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషరావు, పత్తి దుర్గాప్రసాద్ నాయుడు, విశాఖలోని అడవివరం ప్రాంతానికి చెందిన ఎడ్ల వెంకట్రావు మధురవాడ చంద్రంపాలెం ప్రాంతానికి చెందిన పిల్లా శైలజ, పిల్లా మహేష్ , హెచ్.పీ కాలనీకి చెందిన గుజ్జారి మహాలక్ష్మి 65, పైలా వెంకటరత్నం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది అలాగే కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హోం మంత్రి అనిత పరామర్శించారు మరోవైపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్షతగాత్రులను బుధవారం (ఏప్రిల్ 30) పరామర్శించనున్నారు.
కాగా మృతులలొ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్న విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు, ఆయన భార్య శైలజ ఉన్నారు. వీరిరువురికీ మూడేళ్ల కిందట వివాహమైంది. హైదరాబాద్ లోని వేర్వేరు సంస్థలలో పని చేస్తున్న వీరు సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం కోసం బుధవారం (ఏప్రిల్ 30) తెల్లవారు జామునే రూ.300ల ప్రత్యేక దర్శనం క్యూలైన్ లో వేచి ఉన్నారు. భారీ వర్షానికి గోడ కూలిన ఘటనలో వీరివురూ అక్కడికక్కడే మరణించారు. ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడుతున్న సమయంలో భార్యాభర్తలిరువురూ ఇలా మరణించడం పట్ల కుటుంబ సభ్యులు, బంధు మిత్రులూ శోకసంద్రంలో మునిగిపోయారు.