శశిథరూర్-సునందా పుష్కర్ తిట్టుకుచచ్చేవారు: నళిని
posted on Jul 24, 2014 @ 4:50PM
కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం పార్లమెంటు సభ్యుడు శశిథరూర్ మూడో భార్య సునందా పుష్కర్ ఆమధ్య అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. సునందది సహజ మరణం కాదన్న అనుమానాలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి. పోస్టుమార్టం చేసిన డాక్టర్ కూడా సునందది సహజ మరణంగానే చెప్పాలని అప్పటి యుపీఎ ప్రభుత్వం తనమీద వత్తిడి తెచ్చారని చెప్పడం కూడా ఆమధ్య సంచలనం కలిగించింది. తాజాగా ప్రముఖ జర్నలిస్టు నళినీసింగ్ థరూర్ - సునంద మధ్య వున్న ‘అనుబంధం’ గురించి వెల్లడించారు. శశిథరూర్, సునంద పుష్కర్ ఎప్పుడూ గొడవ పడుతూ వుండేవారని, ఒకరిని ఒకరు తిట్టుకునేవారని నళినీసింగ్ వెల్లడించారు. సునందా పుష్కర్ చనిపోయిన రోజు కూడా వాళ్ళిద్దరూ ముందురోజు రాత్రి నుంచి తెల్లవారు ఝామున నాలుగు గంటల వరకు హోటల్ రూమ్‌లో భయంకరంగా గొడవపడి ఒకరినొకరు తిట్టుకున్నారని నళినీసింగ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాను హోటల్ సిబ్బంది నుంచి ధ్రువీకరించుకున్నానని తెలిపారు. పాకిస్థాన్‌కి చెందిన లేడీ జర్నలిస్టు మోహర్ తరార్ పట్ల థరూర్ ఆకర్షితుడవుతున్నాడని సునంద తనతో పలుసార్లు చెప్పిందని నళిని వెల్లడించారు. థరూర్; మెహర్ తరార్ తరచుగా రొమాంటిక్ మెసేజ్‌లు ఇచ్చుకునేవారని, వాటిలో ఒక మెసేజ్‌లో సునందా పుష్కర్‌కి విడాకులు ఇవ్వాలన్న పాయింట్ కూడా వుందని నళిని తెలిపారు.