షర్మిలమ్మని అవమానిస్తున్నారు: పోలీసులకు ఫిర్యాదు
posted on Jun 14, 2014 @ 12:17PM
వైసీపీ నాయకురాలు షర్మిలను కొంతమంది ఇంటర్నెట్‌లో కించపరుస్తున్నారని వైసీపీ నేతలుహైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, సోమయాజులు శనివారం ఉదయం పోలీసు కమిషనర్‌ని కలసి ఈమేరకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వై.వి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘షర్మిలమ్మపై కొన్ని రోజులుగా పథకం ప్రకారం సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం జరుగుతోంది. దానిపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరాం. చెప్పుకోలేని రీతిలో ఈ ప్రచారం చేస్తున్నారు. అది చాలా బాధాకరం’’ అని ఆయన అన్నారు. షర్మిలపై దుష్ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ని కోరామని చెప్పారు. ఈ సైబర్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని సీపీ మహేందర్ రెడ్డి హామీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇదిలా వుంటే, షర్మిలను కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి, ఫొటోలు మార్ఫింగ్ చేసి పెట్టిన ఇద్దరు యువకులను సీసీఎస్ సైబర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.