ఆ వ్యాక్సిన్ తో హెల్త్ సమస్యలు .. వ్యాక్సినేషన్ ను ఆపేసిన ఆరు దేశాలు
posted on Mar 12, 2021 @ 1:22PM
ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టించిన కల్లోలంతో.. అన్ని దేశాలు తమ ప్రజలకు అత్యవసరంగా వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసిన సంగతి తెల్సిందే. ఇప్పటికే అమెరికాలో ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ లు ఇస్తుండగా.. ఇతర దేశాలు వీటితోపాటు ఆస్ట్రాజెనికా ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ను ఇస్తున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ ను ఆరు యూరప్ దేశాలు నిలిపివేశాయి. ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొందరి శరీరంలో రక్తం గడ్డకట్టినట్లుగా తీవ్రమైన ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెల్సుస్తోంది. మరోపక్క ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో రక్తం గడ్డ కట్టినట్టుగా రిపోర్టులు వచ్చాయని డానిష్ హెల్త్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో, ఈ వ్యాక్సిన్ వాడకాన్ని డెన్మార్క్ లో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. మరోపక్క వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే రక్తం గడ్డ కట్టిందని చెప్పేందుకు ఇంకా సరైన ఆధారాలు లేవని పేర్కొంది.
ఇదే కారణం చూపిస్తూ.. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని ఆపేస్తున్నట్టు ఆస్ట్రియా ప్రకటించింది. లిథువేనియా, లాత్వియా, ఎస్టోనియా, ఐస్ ల్యాండ్ దేశాలు కూడా తరువాతి బ్యాచ్ ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ల వాడకాన్ని ఆపేశాయి. తాజాగా వ్యాక్సిన్ వాడకాన్ని నిలిపి వేస్తున్నట్టు డెన్మార్క్ కూడా ప్రకటించింది.
ఇది ఇలా ఉండగా ఈ నెల 9వ తేదీకి యూరోపియన్ ఎకనామిక్ ఏరియాలో 30 లక్షల మందికి పైగా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు వేయాగా.. వీరిలో కొన్ని రక్తం గడ్డం కట్టిన కేసులు వచ్చాయి. దీంతో, ఈ వ్యాక్సిన్ వాడకం పై ప్రజలలో అనుమానాలు తలెత్తుతున్నాయి.