"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" స్టోరీ..!
posted on Jan 11, 2013 @ 9:44AM
25సంవత్సరాల తరువాత టాలీవుడ్ లో వస్తున్న మెగా మల్టీ స్టారర్ మూవీ "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సంక్రాంతి కానుకగా జనవరి 11 విడుదలైంది. ఈ చిత్రం కథ మీ కోసం:
రేలంగి అనే పల్లెటూరులో జరిగే రేలంగి మామయ్య కుటుంబ కథే "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు". రేలంగి మామయ్య ( ప్రకాష్ రాజ్ ) అతనికి ఇద్దరు కొడుకులు. పెద్దోడు ( వెంకటేష్) , చిన్నోడు ( మహేష్ బాబు ).
పెద్దోడు వెంకటేష్ (నిరుద్యోగి) చాలా ఎమోషనల్ గా ఉండే యువకుడు. ఎవరి ముందు తలవంచకుండా తనకి నచ్చింది చేస్తూ మంచి అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. ఇతనికి తన తమ్ముడు అంటే ప్రాణం. సీత అంజలి తనకి చిన్నపాటి నుంచి తన బావ (వెంకటేష్) అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా తననే పెళ్ళి చేసుకుంటాడని కలలు కంటూ ఉంటుంది.
చిన్నోడు మహేష్ బాబు చాలా తెలివిగల యువకుడు. ఎంతటి క్లిష్ట పరిస్థితులైన తనకి అనుగుణంగా మార్చుకుంటాడు. ఇతను ఒకసారి గీత (సమంత) అనే అమ్మాయిని చూడగానే ప్రేమలో పడిపోతాడు. రేలంగి మామయ్య ( ప్రకాష్ రాజ్ ) కుటుంబం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావడంతో గీత (సమంత) వాళ్ళ ఫాదర్ చులకనగా చూస్తాడు.
వెంకటేష్ నిరుద్యోగి కావడంతో కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు వస్తాయి. మహేష్ బాబు మరియు వెంకటేష్ కొంచెం మధ్య దూరం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో ప్రకాష్ రాజ్ ఎలా స్పందిస్తాడు? వెంకటేష్ మరియు మహేష్ బాబు వారి ప్రేమను ఎలా గెలుచుకున్నారు అనేది మిగతా సినిమా.