సీమాంధ్ర కార్పొరేషన్లలో టీడీపీ హవా
posted on May 12, 2014 @ 10:24AM
సీమాంధ్రలోని కార్పొరేషన్లలో తెలుగుదేశం హవా నడుస్తోంది. సీమాంధ్రలో రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు విడుదలవుతున్న ఫలితాలలో తెలుగుదేశం పార్టీ ఐదు కార్పొరేషన్లలో ముందంజలో వుండగా, వైకాపా రెండు స్థానాల్లో ముందంజలో వుంది. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు. చిత్తూరు, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, అనంతపురం కార్పొరేషన్లలో తెలుగుదేశం ముందంజలో వుండగా, నెల్లూరు, కడప కార్పొరేషన్లలో వైకాపా ఆధిక్యంలో వుంది.