గుర్తుపట్టలేని విధంగా జగ్గారెడ్డి...
posted on Aug 19, 2014 7:53AM
సంగారెడ్డి మాజీ శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి ఎంతమాత్రం గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. బారెడు గడ్డంతో తన మార్కు గెటప్‌తో అందరికీ పరిచితుడైన ఆయన లేటెస్ట్‌గా క్లీన్ షేవ్‌తో గుర్తించలేని విధంగా మారిపోయారు. రెండు రాష్ట్రాల్లోని ప్రజలు మాత్రమే కాదు.. సాక్షాత్తూ సంగారెడ్డి ప్రజలు కూడా ఇప్పుడు ఆయన్ని గుర్తుపట్టలేరు. సోమవారం నాడు జగ్గారెడ్డి తిరుమలకు వెళ్ళి నీలాలు సమర్పించారు.దాంతో ఇప్పుడు జగ్గారెడ్డిని చూస్తే ఎవరో కొత్త మనిషిని చూసిన విధంగానే వుంది. జగ్గారెడ్డి రాజకీయ రంగప్రవేశం చేసినప్పటి నుంచి గడ్డంతోనే కనిపించారు. ఆయన గడ్డం మీద, జుట్టు బాగా పెరిగిపోయిన ఆయన గెటప్ మీద ఎవరు ఎన్నిరకాలుగా విమర్శలు చేసినప్పటికీ ఆయన తన గెటప్ మార్చుకోలేదు. తాజాగా ఏడుకొండల వెంకన్నకి తన నీలాలు సమర్పించారు. తన గడ్డం వెనుక ఎలాంటి మొక్కూ లేదని జగ్గారెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.