మేనల్లుడి అంత్యక్రియలకు వెళ్లలేకపోయిన సల్మాన్!
posted on Apr 2, 2020 @ 12:02PM
సల్మాన్ ఖాన్ సొంత మేనల్లుడి అంత్యక్రియలకు హాజరు కాలేని దుస్థితి. సల్మాన్ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ అనారోగ్యంతో మృతి చెందాడు. 38 ఏళ్ల అబ్దుల్లా ఖాన్, గుండెపోటు బారిన పడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సల్మాన్ కుటుంబంతో చాలా సన్నిహితంగా మెలిగే ఈయన అంత్యక్రియలు ఇండోర్‌లో ఎప్రిల్ 1న జరిగాయి.
అయితే లాక్ డౌన్ కారణంగా సల్మాన్ సహా చాలా మంది అబ్ధుల్లా అంత్యక్రియలకు హాజరు కాలేక పోయారు. కేవలం తక్కువ మందితోనే ఖననం జరగింది. కరోనా వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో సల్మాన్ ఖాన్ ఈ అంత్యక్రియలకు హాజరు కాలేదు. నిరుపేద, కోటీశ్వరుడు, సామాన్యుడు, సెలబ్రెటీ ఎవ్వరినీ ఈ కరోనా ప్రభావం వదల లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ తో ఎక్కడిక్కడ వ్యవస్థలన్నీ స్థంభించి పోయాయి.