ఐదు పరుగులిచ్చిన గ్లౌవ్
posted on Oct 25, 2022 @ 4:11PM
ఈసారి టీ20 ప్రపపంచకప్ లో వింతలు విడ్డూరాలే జరుగుతున్నాయి. ఆటతో పాటు విచిత్రాలూ ప్రేక్షకు లను ఆకట్టుకుంటున్నాయి. ఊహించని విధంగా క్యాచ్ లు పట్టడం, సిక్స్ లు బాదడంతోపాటు వికెట్ కీపర్ విన్యాసాలు గమనిస్తున్నాం. అయితే మరో చిత్ర విచిత్రమేమంటే దక్షిణాఫ్రికా పెనాల్టీగా ఐదు పరుగులు ఇవ్వడం.
మొన్న దక్షిణాఫ్రికా, జింబాబ్వే మ్యాచ్ లో జింబాబ్వే ఉట్టినే 5 పరుగులు సాధించింది. అందుక్కారణం కూడా దక్షిణాఫ్రికా ఫీల్డర్లే కారణం. సోమవారం గ్రూప్ 2లో జరిగిన ఈ మ్యాచ్ లో పెనాల్టీ పరుగులు ఇచ్చుకోవాల్సి వచ్చింది. జింబాబ్బే ఇన్నింగ్స్ 9వ ఓవర్లో మూడో బంతి ని జింబాబ్వే బ్యాటర్ మిల్టన్ వికెట్ కీపర్ వెనగ్గా ఫోరో సిక్సో కొట్టాలనుకున్నాడు. కానీ చేతకాలేదు. బంతి శరవేగంతో వెళ్లింది. రివర్స్ స్కూప్ ఆడబోతే అది కాస్తా ఫైన్ లెగ్ లోకి వెళ్లింది. అక్కడి ఫీల్డర్ ఎన్గిడి బంతిని అందుకుని వేగంగా కీపర్ డీకాక్ కి విసిరాడు. డికాక్ జింబాబ్వే బ్యాటర్ ను అవుట్ చేయాలన్న తొందరలో చేతికి ఉన్న కీపర్ గ్లౌవ్ తీసి పడేసి బంతిని పట్టుకున్నాడు. కానీ అది కాస్తా వికెట్లను తాకింది. వాటి మీద ఉన్న బెయిల్ పడింది. బ్యాటర్ అవుటయ్యాననుకన్నాడు. కానీ గ్లౌవ్ విసిరేయడంతో అది పడింది కనుక అవుటియ్య లేదు. పైగా అలా చేసినందుకు దక్షిణాఫ్రికా జట్టు అయిదు పెనాల్టీ పరుగులు సమర్పించు కోవాల్సి వచ్చింది. బ్యాటర్ కదలకుండానే అయిదు పరుగులు సాధించడం అందర్నీ ఆశర్యర్యపరి చింది. డీకాక్ కూడా ఇదేందిరా అయ్యా అన్నట్టు చూశాడు.
కానీ రూల్స్ అలానే ఉన్నాయి. గ్లైవ్ వికెట్లను తాకితే బెయిల్స్ కిందపడితే బ్యాటింగ్ చేస్తున్నవారికి అయిదు అదనపు పరుగులు ఇవ్వాలి. అలా పెనాల్టీ పడిందన్నమాట. అంచేత ఆడటం అంత సులువు కాదు. సవాలక్ష నిబంధనల మధ్యలో కాస్తంత భయం భయంగానే ఆడాలి. స్వేచ్ఛ తీసుకోవడానికి చాలా పరిమితులు ఉంటాయి. ఆవేశంలో వాటిని అధిగమిస్తే ఫలితం ఇలానే ఉంటుంది. అందుకే మధ్యలో బ్యాటర్, బౌలర్ మధ్య గొడవలు జరిగినా మీదకు వచ్చినా ఇరుజట్ల కెప్టెన్లు పరుగున వచ్చి సర్దిచెప్పుకు పోతుంటారు. రోడ్డు మీద కొట్టుకున్నట్టు కొట్టుకుంటే డేంజరే. పెనాల్టీ పరుగుల మాట ఎలా ఉన్నా, ఆట నించి బయటికి పంపేస్తారు.