ఏపీలో జగన్ పాలన మటాష్.. మొన్న కేటీఆర్.. నిన్న హరీష్ విమర్శ
posted on Jun 14, 2022 @ 12:17PM
అందరం ఒకటే. అందరం తెలుగువాళ్లమే. కాబోతే రాజకీయంగానే విడిపోయాం. మనమంతా సోదరుల మే అని తెలంగాణా, ఆంధ్రా నాయకులు తెగ ప్రచారం చేసుకున్నారు. కాలక్రమంలో రాజకీయాల సెగలో మాట ల తూటాలతో పొడవడం మెల్లగా ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా రాష్ట్రాల అభివృద్ధి విష యంలో తెలంగాణా రాజధానిలో జరుగుతున్న అభివృద్ధిని చూపుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ రెడ్డిని ఎద్దే వా చేయడం చూచాయిగా జరుగుతోంది. చాలా స్నేహపూర్వకంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
టిఆర్ ఎస్ నేత హరీష్ రావు తిరుపతి పర్యటకు వెళ్లినపుడు కలిసిన వారితో జరిపిన చర్చల్లో అసలు ఆం ధ్రాలో రైతులకు విద్యుత్ సౌకర్యం కల్పించడంలో అక్కడి ప్రభుత్వం విఫలమయిందన్నది అక్కడి వారి మాటల్లోనే అర్ధమయిందిట. రైతులకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లు తొమ్మిది గంటలు కాదు గదా కనీసం ఏడుగంటలు కూడా విద్యుత్ అందంచడం లేదని రైతులు గోడు పెడుతున్నారని హరీష్‌ను కలిసినవారు చెప్పారట. అలాంటపుడు తెలంగాణా కంటే ఆంధ్రాలో రైతాంగానికి గొప్ప సేవలు అందిస్తు న్నామని ప్రచారం చేసుకో వడంలో అర్ధమే మిటో తెలియాలి. రాష్ట్రంలో ప్రచార ఆర్భాటాలే తప్ప నిజానికి అభివృద్ధి కార్య క్రమాలు శూన్యమని విపక్షా లు ఇప్పటికే దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ సమయంలో హరీష్ ఆంధ్రాలో రైతుల పరిస్థితి అంత గొప్పగా లేదని అక్కడివారే తెలియజేశారని అనడం జగన్‌కి ఇబ్బంది కరమే.
హరీషే కాదు ఆ మధ్య కేటీఆర్ కూడా పాసింగ్ కామెంట్ చేసేరు. దావోద్ ఆర్ధిక సదస్సుకు వెళ్లడానికి ముందు అసలు ఆంధ్రాలో రోడ్లు, పురపాలక వ్యవస్థ గొప్పగా ఏమీ లేదని కేటీఆర్ కామెంట్ చేసేరు. హైద రాబాద్‌తో పోలిస్తే ఆంధ్రాలో ఏ నగరంలోనూ అంతగా అభివృద్ధి కనపడదన్నారు. ఆ తర్వాత దావోస్ సదస్సు సందర్భంగా జగన్‌ని స్నేహపూర్వకంగా కలిసినపుడు మాత్రం ఇద్దరూ పాత మిత్రుల స్థాయిలో స్వవిషయాలు కూడా మాట్లడుకోవడమే వింత!
పైకి స్నేహంగా కనపడుతున్నప్పటికీ ఈ స్నేహం రాజకీయాంశాల విషయంలో కనపడటం లేదు. విడిపో యినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా సహకారం ఎప్పడూ వుంటుదని విడిపోయిన కొత్తల్లో అన్న మాటలకు మరి అర్ధాలువేరా? ఏమో ఈ స్నేహపూర్వకంగా కనిపించే రాజకీయ ధోరణికి అర్ధం కూడా యువ నేతలే బయటపెట్టాలి.