రెచ్చిపోయిన రూసో..దక్షిణాఫ్రికా చేతిలో బంగ్లా చిత్తు
posted on Oct 27, 2022 @ 1:03PM
సిడ్నీలో గురువారం జరిగిన టీ20 ప్రపంచకప్ సూపర్12 మ్యాచ్ దక్షిణాఫ్రికా 104 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. ముందుగా బ్యాట్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ 16 ఓవర్లలో కేవలం 101 పరుగులు చేసి వెనుదిరిగింది. మంచి ఫీల్డింగ్ సత్తా ఉన్న బంగ్లాదేశ్ ఊహించని విధంగా భారీ స్కోర్ సమర్పించుకోవడం, బ్యాటింగ్ లో ఘోరంగా విఫలం కావడం ప్రేక్షకులు ఊహించలేదు. 205 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేంత బ్యాటర్లు బంగ్లా జట్టులో లేకపోలేదు. కానీ చాలా పేలవంగా ఆడి మ్చాచ్ ను సమర్పించుకున్నారు.
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ రూసో బంగ్లాదేశ్ ఫీల్డర్లకు, బౌలర్లకు సింహస్వప్పంగా మారాడు. సిడ్నీలో భారీ సెంచరీతో ప్రేక్షకులను అలరించాడు. కేవలం 56 బంతుల్లో రూసో 109 పరుగులు (14 ఫోర్లు) చేయడంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 205 పరుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్లో ఇదే అతని తొలి సెంచరీ. 16వ ఓవర్లో తొలి బంతిని సింగిల్ తీయడంలో సెంచరీ పూర్తి చేసిన ఆనందంలో గెంతులు వేశాడు, రూసో ఎంతో ఉద్వేగానికి గురయ్యాడు. సిడ్నీ గ్రౌండ్లో ఇంతటి టోర్నీలో సెంచరీ చేయడం అందునా 20 ఓవర్లో మ్యాచ్లో చేయడం అంత సులభం కాదు.
ఇంతకు ముందు భారత్ తో తలపడిన టీ20 సిరీస్ లో 48 బంతుల్లోనే సెంచరీ చేసి తన బ్యాటింగ్ సత్తాను భారత్ బౌలర్లకు తెలియజేశాడు. రూసోకి ధీటుగా మరో వంక డీ కాక్ కూడా రెచ్చిపోయి 38 బంతుల్లో 63 పరుగులు(11 ఫోర్లు) చేయడంలో తన బ్యాటింగ్ సత్తాను మరోసారి ప్రదర్శించాడు.