హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

 

భారత క్రికెట్ కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించింది. ముంబైలోని వాంఖడేలో భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మీద స్టాండ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. నా పేరు మీద ఒక స్టాండ్ కలిగి ఉండటం చాలా ప్రత్యేకమైన అనుభూతి అవుతుంది.  భారతదేశం ఇక్కడ ఏ జట్టుతో ఆడినా, అది మరింత ప్రత్యేకంగా ఉంటుందన్నారు.

 ఈ పెద్ద గౌరవం లభించినందుకు నేను కృతజ్ఞుడను’’ అని అన్నాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రోహిత్ శర్మ తల్లిదండ్రులు నేడు ఈ స్టాండ్‌ను ఆవిష్కరించారు. రోహిత్ శర్మతో పాటు అతడి కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడు మైదానం మధ్యలో నుంచి రోహిత్ శర్మ స్టాండ్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, భారత జట్టు మాజీ కెప్టెన్‌ అజిత్‌ వాడేకర్‌లతో పాటు రోహిత్‌ సతీమణి రితికా సజ్దే పాల్గోన్నారు

Teluguone gnews banner