పెషావర్ ఎయిర్ పోర్ట్ పై రాకెట్ దాడి: 7గురు మృతి

 

 

 

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఉన్న అంత ర్జాతీయ విమానాశ్రయంపై శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిన రాకెట్ల దాడిలో ముగ్గురు పౌరులు, ఐదుగురు మిలిటెంట్లు మరణించారు. ఆయుధాలు ధరించి ఆత్మాహుతి దాడి జరిపేందుకు వచ్చిన మిలిటెంట్లను ఎయిర్‌పోర్ట్‌లోని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని అధికారులు వెల్లడించారు. మిలిటెంట్లు జరిపిన దాడితో మూడు రాకెట్లు విమానాశ్రయంలో పేలినా, భారీ ఆస్తి నష్టం మాత్రం జరగలేదని పేర్కొన్నారు.



ఈ ఘటనలో గాయపడి తమ ఆస్పత్రిలో చేరిన వారిలో సుమారు 40 మంది వరకు తీవ్రంగా గాయాలపాలై ఉన్నారని ఖైబర్ టీచింగ్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బాధితుల్లో చిన్నారులతో పాటు మహిళలు, వృదులు కూడా ఉన్నారన్నారు. కాగా, ఈ దాడి పక్కా ప్రణాళిక ప్రకారం జరిగినా తమ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని పాక్ రక్షణ మంత్రి నవీద్ ఖమర్ అన్నారు. ఈ ఘటనకు తెహ్రిక్ ఈ తాలిబన్ సంస్థ బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించింది.

Teluguone gnews banner