ప్రియాంక అవసరం నాకు లేదు.. రాబర్ట్ వాద్రా
posted on Apr 15, 2016 @ 12:06PM
సోనియా గాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రాపై భూ కొనుగొళ్ల వ్యవహారంపై ఆరోపణలు ఉన్నసంగతి తెలిసిందే. రాజస్థాన్, హర్యానాలో వాద్రా కంపెనీలు అక్రమ భూ కొనుగోళ్లకు పాల్పడినట్టు బీజేపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాద్రా స్పందించి.. నేను ఇక్కడే పుట్టాను.. ఇక్కడే ఉంటాను.. దేశాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం నాకు లేదు అని ఆయన అన్నారు. అంతేకాదు.. ఈ విషయంపై ఆయన ఇంకా మాట్లాడుతూ ప్రియాంక గాంధీ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నా జీవితాన్ని ఉద్ధరించడానికి ప్రియాంక అవసరం నాకు లేదు అని అన్నారు. నా తండ్రి నాకు చాలినంత ఇచ్చారు.. అన్ని రకాల పరిస్థితులను తట్టుకొని నిలబడగల చదువు నాకుంది' అని వాద్రా ఏఎన్‌ఐ వార్తాసంస్థతో పేర్కొన్నారు. ఇంకా ఆయన రాజకీయ ఎంట్రీపై మాట్లాడుతూ.. తానేప్పుడూ రాజకీయాల్లోకి రానని చెప్పలేదు.. నా ఆత్మసాక్షి రమ్మంటే వస్తాను.. దేనికైనా టైమ్ రావాలని వ్యాఖ్యానించారు. అయితే అంతా బాగానే ఉన్నా వాద్రా ప్రియాంక గాంధీ గురించి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడ హాట్ టాపిక్ అయ్యాయి.