విజయవాడ లో ఘోర రోడ్డు ప్రమాదం

 

 

 

 

నగరంలోని బెంజ్ సర్కిల్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఎస్వీఆర్ ట్రావెల్ బస్సు బెంజ్ సర్కిల్ వద్ద డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

 

ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారికి కూడా గాయాలయ్యాయి. డ్రైవర్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. తీవ్రగాయాలైన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. అటు బస్సులో ప్రయాణిస్తున్న వారు.. భయంతో వణికిపోయారు. యాక్సిడెంట్‌ జరగ్గానే స్థానిక నేతలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అర్థరాత్రి వేళల్లో ట్రావెల్స్‌ బస్సులు మితిమీరిన వేగంతో వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి సమయాల్లో నిఘా పెంచాలని కోరారు. ఓవర్‌ స్పీడ్‌ కారణంగానే యాక్సిడెంట్‌ జరిగిందని వారు చెబుతున్నారు.

Teluguone gnews banner