Read more!

ఏపీ పాలిటిక్స్‌పై వర్మ వ్యంగ బాణాలు.. ర‌చ్చ చేస్తున్నారా? మంచి స‌ల‌హానే ఇచ్చారా?

విషయం ఏదైనా సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, కావాలసిన మషాలా దట్టించి ట్వీట్’ చేసి సంచలనం సృష్టిస్తారు. అది ఆయన స్టైల్. ఆ విధంగా  ఆయన ఎప్పుడు వార్తల్లో వ్యక్తిగా ఉండిపోతారు. ఇది వర్మ తెలిసిన అందరికీ తెలిసిన నిజం. కాగా.  తాజగా ఆయన ఆంధ్ర ప్రదేశ్’లో సాగుతున్న వికృత రాజకీయలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికార వైసీపీ నాయకులు తెలుగు దేశం పార్టీ కార్యాలయాలు, పార్టీ నాయకులపై భౌతిక దాడులకు దిగుతున్న నేపధ్యంలో,వర్మ ఏపీలో రాజకీయ నాయకులు బాక్సింగ్‌ నేర్చుకోవాలంటూ ట్విటర్‌ వేదికగా కామెంట్స్‌ చేశారు. “ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అతిత్వరలో అక్కడ నాయకులు బాక్సింగ్‌, కరాటే, కర్ర యుద్ధం నేర్చుకోవాల్సి ఉంది’’ అని ఆర్జీవీ వ్యంగ్యంగా అన్నారు. 

వర్మ వ్యంగ్యంగానే ఈ వ్యాఖ్యలు చేసినా, ఆయన వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితికి అద్దం పట్టేలా ఉన్నాయి. అంతే కాదు ఇప్పటికే మాటల గీత దాటి భౌతిక దాడులకు పాల్పడుతున్న వైసీపే గూండాలు ముందు ముందు మరింత బరితెగిస్తారని, వారి నుంచి స్వీయ రక్షణకు ప్రతిపక్ష నాయకులు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవలసిన అవసరం  ఉందన్న సందేశం కూడా వర్మ ట్వీట్ ‘లో ఉందని అంటున్నారు. 

రెండురోజుల క్రితం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటుగా జిల్లా కార్యాలయాలఫై వైసీపీ నాయకులు, కార్యకర్తలు  దాడిచేయడంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కిన విషయం తెలిసిందే. కేంద్ర కార్యాలయంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడియత్నాలకు నిరసనగా బుధవారం తెదేపా బంద్‌ నిర్వహించింది. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మరోవైపు పార్టీ శ్రేణులపై దాడులను నిరసిస్తూ గురువారం ఉదయం నుంచి 36 గంటలపాటు తెదేపా అధినేత చంద్రబాబు దీక్ష చేపట్టారు.ఒక విధంగా చూస్తే ప్రస్తుతం ప్రదేశ్ రాష్ట్రంలో ఏ క్షణానికి ఏమి జరుగుతుందో ఊహించలేని పరిస్థితులు నెలకొన్నాయి. అడలేక  మద్దెల ఓడన్నట్లు ముఖ్యమంత్రి తమ చేతకాని తనాన్ని, అసమర్ధ పాలనను కప్పిపుచ్చుకునేందుకు దాడులను ఉపయోగించుకుంటున్నారు. వక్ర భాష్యాలు చెప్పి, దాడులను ప్రోత్సహించే విధంగా, ‘తిడితే కొట్టరా.. కొడతారు .. అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక విధంగా ప్రతిపక్ష పార్టీల నాయకులను కార్యకర్తలను కొట్టండని ప్రోత్సహిస్తున్నారు. అందుకే వర్మ ట్వీట్ వైరల్ అవుతోంది.