గుర్తు పెట్టుకుంటా.. పోలీసులకు రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..
posted on Sep 22, 2021 @ 2:12PM
రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీస్ అధికారులకు ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చారు. టీఆర్ఎస్‌కు వత్తాసు పలికే అధికారులను గుర్తుపెట్టుకుంటామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తప్పవని గట్టిగా చెప్పారు రేవంత్‌రెడ్డి.
తనకు అదనపు భద్రత కల్పించాలని కోర్టు చెప్పిందని పోలీసులకు గుర్తు చేశారు రేవంత్‌రెడ్డి. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు పీసీసీ చీఫ్.
తన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే, దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టకుండా.. కాంగ్రెస్ కార్యకర్తలపైనే అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు.
టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలను భయపెడుతున్నారని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రాన్ని బిహార్‌గా మార్చాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ శ్రేణులపై ప్రతీకార చర్యలు తగవంటూ మండిపడ్డారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.