రేవంత్‌రెడ్డి దెబ్బ.. కారుకా? కమలానికా? దిమ్మ తిరిగేది ఎవరికి?
posted on Jun 27, 2021 @ 12:45PM
రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ పట్టాభిషేకం చేసింది. తెలంగాణ సింహాసనంపై సింహాన్ని కూర్చోబెట్టింది. ప్రత్యర్థులపై గాండ్రించేందుకు లయన్ రేవంత్‌రెడ్డి రెడీ అవుతున్నారంటూ ఫాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఎన్నాళ్లో వేచిన ఉదయం అంటూ జిల్లాల్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. రేవంతన్న వచ్చాడు.. ఇక హస్తం పార్టీకి పునర్‌వైభవం తీసుకొస్తాడంటూ కాలర్ ఎగరేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక కాస్తో కేసీఆర్.. ముఖ్యమంత్రికి ముచ్చమటలేనంటూ సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నారు. రేవంత్‌రెడ్డికి పీసీసీ పీఠం కట్టబెట్టడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో మునుపెన్నడూ లేనంత ఉత్సాహం.. వెయ్యి ఏనుగుల బలం. అయితే, కాంగ్రెస్ బ్యాచ్ ఇంతగా హడావుడి చేస్తున్నా.. టీఆర్ఎస్ మాత్రం బిందాస్‌గా కనిపిస్తోంది. రేవంత్‌రెడ్డితో తమకు వచ్చే నష్టమేమీ లేదన్నట్టు.. తామేమీ హైరానా పడట్లేదంటూ కులాసాగా ఉంది. ఇంతకీ, టీఆర్ఎస్‌లో అంత ధీమాకు కారణమేంటి?
రేవంత్‌రెడ్డితో టీఆర్ఎస్‌కే కదా మెయిన్ ఎఫెక్ట్? అంటే డివైడ్ టాక్ వినిపిస్తోంది. అవును, రేవంత్‌రెడ్డి టార్గెట్ అంతా కేసీఆర్‌పైనే ఉంటుంది. ఇక రోజూ కేసీఆర్‌కు రేవంత్ నుంచి మద్దెల దరువు తప్పకపోవచ్చు. గులాబీ బాస్‌కు పక్కలో బల్లెంలా మారుతాడనడంలో డౌటే అవసరం లేదంటున్నారు. అయినా, టీఆర్ఎస్‌పై రేవంత్ ఎఫెక్ట్ అంతంత మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏం చేశాడు..? ఇప్పుడు ప్రెసిడెంట్‌గా ఇంకేం చేస్తాడు..? అన్నట్టు కారు పార్టీ లైట్ తీసుకుంటోంది. అసలైన దెబ్బ బీజేపీకి తగులుతుందని అంచనా వేస్తోంది. అందుకు కేసీఆర్ లెక్క మరోలా ఉంది....
రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ఎంతగా విమర్శిస్తే అంత హీరో అవుతారు. ఏళ్లుగా ఇదే ఆయన చేస్తున్న పని. ప్రజా సమస్యల ప్రస్తావనకంటే.. కేసీఆర్ అండ్ కో పై విమర్శలకే అధిక ప్రాధాన్యం ఇస్తారనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. ఇకపైనా కేసీఆర్‌పై విమర్శల డోసు మరింత పెంచే అవకాశం ఉంది. ఆయన నోరే ఆయన బలం. ఆకట్టుకునేలా మట్లాడటం.. సూటిగా, ఘాటుగా మాటల దాడి చేయడం రేవంత్ స్పెషాలిటీ. అదే ఆ డైనమిక్ లీడర్‌ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై ఎంతగా ఫోకస్ పెంచితే.. ఆయనపై ప్రజల అటెన్షన్ అంతగా పెరుగుతుంది. రేవంత్ కూడా ఇకపై అదే పని చేస్తారు. పబ్లిక్‌లో ఆయన ఇమేజ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లో మరో వైఎస్సార్‌లా తిరుగులేని నాయకుడిగా మారుతారు. టీఆర్ఎస్‌కు ధీటుగా కాంగ్రెస్‌ను బలమైన ప్రతిపక్షంగా నిలబెడతారు రేవంత్‌రెడ్డి. ఇదే జరిగితే... కారు పార్టీ కంటే కమలానికే ఎక్కువ నష్టమనేది విశ్లేషకుల మాట.
కొంతకాలంగా టీఆర్ఎస్‌కు ధీటుగా బీజేపీ దూసుకొస్తోంది. బస్తీ మే సవాల్ అంటూ కమలనాథులు కేసీఆర్‌పై తొడగొడుతున్నారు. ఆ మేరకు జనాల్లోనూ పువ్వు గుర్తుకు పాపులారిటీ పెరుగుతోంది.. దుబ్బాక, జీహెచ్ఎమ్‌సీలో ఆ మేరకు మంచి ఫలితాలు రాబట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ పెద్దగా యాక్టివ్‌గా లేదు. రేవంత్‌రెడ్డి కాస్త సైలెంట్ మోడ్‌లో ఉన్నారు. అందుకే, వార్.. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది. కానీ, ఇప్పుడు రేవంత్‌రెడ్డి బరిలో దిగారు. సింహంలా పంజా విసిరేందుకు సిద్ధమవుతున్నారు. ఆ పంజా దెబ్బ.. టీఆర్ఎస్‌కంటే బీజేపీకే ఎక్కువ డ్యామేజ్ చేస్తుందనేది ఓ వాదన. రేవంత్ డైనమిక్ పాలిటిక్స్‌తో ప్రభుత్వ వ్యతిరేక వర్గమంతా కాంగ్రెస్ వైపు కన్సాలిడేట్ అయితే..? అది బీజేపీకే నష్టం. ఇన్నాళ్లూ కేసీఆర్‌కు యాంటీగా జనాలు బీజేపీ వైపు మొగ్గు చూపితే.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్‌తో ఆ వ్యతిరేకతంతా హస్తం వైపు మళ్లుతుందని అంచనా వేస్తున్నారు. అటు, ఈటల రాజేందర్ ఇటీవల బీజేపీలో చేరగా.. ఆయన సైతం హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి కాషాయం పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటు రేవంత్, అటు ఈటల.. ఇద్దరు కలిసి ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చే అవకాశం ఉంది. అంటే.. టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఆ పార్టీకి అలానే ఉంటుంది. కానీ, వ్యతిరేక ఓటు కాంగ్రెస్, బీజేపీ మధ్య చీలిపోతుందని చెబుతున్నారు. అది టీఆర్ఎస్‌కే లాభం చేసి.. ఆ మేరకు బీజేపీని దెబ్బతీస్తుందని అంటున్నారు. అలా జరిగితే.. ఎప్పటిలానే కేసీఆర్ మళ్లీ బిందాస్......