పబ్బుల్లో ఆ డాన్సులేంటి.. రోజాపై బాలకోటయ్య ఫైర్!

నటి, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పేరు వివాదాలలో తప్ప సాధారణంగా వినిపించదు. మంత్రిగా ఆమె చేపట్టే కార్యక్రమాలు, అమలు చేసే పథకాల విషయం ఎలా ఉన్నా, తన వ్యవహారశైలితో, తనకే సాధ్యమైన విమర్శనా పటిమతో మాత్రం ఆమె నిత్యం వార్తల్లో ఉంటారు. ఏదో సినిమాలో అన్న నడిచొస్తే మాస్తు.. అన్న లుక్కెస్తే మాస్ అన్న అ పాటలా  రోజా డ్యాన్స్ చేస్తే వివాదం, రోజా మాట్లాడితే వివాదం అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. ప్రజలు ఓ వైపు తుపాను కారణంగా నానా ఇబ్బందులూ పడుతుంటే.. ప్రభుత్వ సాయం కోసం పడిగాపులు పడుతుంటే.. అదే వానలో   డ్యాన్సులు చేస్తూ  రీల్స్ చేయగలిగే ధైర్యం, తెగింపు రోజాకే చెల్లింది. అంతా నాఇష్ఠం ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అన్నట్లుగా రోజా వ్యవహార శైలి ఉంటుంది.  

ఇప్పుడు మళ్లీ కొత్తగా రోజా ప్రస్తావన ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వద్దాం. తాజాగా న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా బెంగళూరులో ఓ పబ్బులో మంత్రి రోజా చేసిన డ్యాన్స్ చేస్తూ రోజా సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురయ్యారు.

ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య రోజాను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రోజా తన తీరుతో ప్రభుత్వ పరువునే కాకుండా రాష్ట్రం పరువును కూడా తీసేస్తున్నారని పేర్కొంటూ ఆమెను వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని కోరుతూ సీఎం జగన్ కు ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో రోజా లాంటి మంత్రిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు.  ఈ సందర్భంగా ఆయన రోజు మంత్రిగా అనర్హురాలని పేర్కొన్నారు. తనను గెలిపించిన నియోజకవర్గానికి రోజా చేసింది శూన్యమని విమర్శించారు. అటువంటి వ్యక్తం కేబినెట్ లో ఉండటం ప్రజా స్వామ్యానికే మాయని మచ్చ అంటూ ఫైరయ్యారు.   

Teluguone gnews banner