చంద్రబాబు పేరు తొలగించండి.. హైకోర్ట్
posted on Dec 5, 2015 @ 4:51PM
ఎర్ర చందనం స్మగ్లర్ గంగిరెడ్డిని పోలీసులు మారిషన్లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతనిని పోలీసులు కడప సెంట్రల్ జైలులో గంగిరెడ్డి విచారణ ఖైదీగా ఉంచారు. అయితే గంగిరెడ్డి భార్య కొద్దిరోజుల క్రింత తన భర్త గంగిరెడ్డికి ప్రాణహాని ఉందని.. అది కూడా చంద్రబాబు వల్ల అని ఆరోపించింది. అంతేకాదు దీనిపై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. తన భర్తను ప్రాణహాని ఉందని.. తెలంగాణలోని ఏదైనా జైలుకు తరలించాలని ఆమె పిటిషన్లో పేర్కొంది. అయితే దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు పిటిషన్‌లో రెస్పాండెంట్‌గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరును తొలగించాలని ఆదేశించింది. అంతేకాదు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా.. అత్యున్నత స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు పేరును చేర్చడం తగదని సూచించింది. కాగా ఈనెల 7వ తేదీన హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణ చేయనుంది.