చంద్రబాబు ఏడుపు తర్వాత జగన్-కేసీఆర్ మిలాఖత్!.. లింక్ ఏంటి?
posted on Nov 22, 2021 @ 10:21AM
సీఎం జగన్.. సీఎం కేసీఆర్.. కలిశారు. పక్కపక్కనే కూర్చున్నారు. బాగా మాట్లాడుకున్నారు. కాసేపు ఏకాంతంగానూ ముచ్చటించారు. రెండేళ్ల క్రితమైతే ఇదేమంత ఇంట్రెస్టింగ్ విషయం కాకపోవచ్చు. ఇప్పటి సమయం, సందర్భాన్ని బట్టి.. ఇది బ్రేకింగ్ న్యూస్ అయింది. అంతకంటే షాకింగ్ అనుమానాలు కలుగుతున్నాయి. వాళ్లిద్దరి భేటీని రెండు రకాలుగా విశ్లేషిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఏర్పడి.. అటు ఇటు మంత్రులు నోటికి పని చెబుతున్న సమయంలో ఇద్దరు సీఎంలు ఇలా నవ్వుతూ కబుర్లు చెప్పుకోవడం మామూలు సంగతి అయితే కాదు. ఇక, ఏపీ అసెంబ్లీలో చంద్రబాబును అవమానించడం, ఆయన ప్రెస్‌మీట్‌లో భోరున విలపించడం.. రాష్ట్రమంతా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో.. ఇలా జగన్-కేసీఆర్ కూడబలుక్కొని కలిశారా? అనే డౌటనుమానం.
దొందుదొందేనని మొదటి నుంచీ అంటున్నారు. జగన్-కేసీఆర్‌లు కావాలనే జల జగడానికి దిగుతున్నారని అనుమానించారు. వారి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఉద్రిక్తతలు రాజేస్తున్నారని అన్నారు. వైఎస్సార్‌ను నరరూప రాక్షసుడని, జగన్‌ను గజదొంగ అని, కేంద్ర దగ్గర బిచ్చమెత్తుకుంటున్నాడని.. తెలంగాణ మంత్రులు నోటికొచ్చినట్టు తిట్టారు. ఏపీ మంత్రులు సైతం అంతకాకపోయినా.. ఓ మోస్తారుగా కౌంటర్ ఇచ్చారు. తనను, తన తండ్రిని అన్నేసి మాటలు అన్న కేసీఆర్ అండ్ కో.. తో జగన్ అంత ఉల్లాసంగా ఉన్నారంటే అర్థం ఏంటి? మనసులో నిజంగా ధ్వేషమే ఉంటే.. బయటకు అంత బాగా నటించగలరా? నటించడంలో జగన్‌రెడ్డి ఎక్స్‌పర్టే అయినా.. కేసీఆర్-జగన్‌లను చూస్తే అది నటనలా లేదు.. ట్రూ ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నారు. అంటే.. దొందుదొందనే అనుమానం నిజమనేగా? ఇన్ని నెలలుగా అంత అలజడి చెలరేగుతున్నా.. కనీసం ఫోన్లో కూడా మాట్లాడుకున్నట్టు మేటర్ లీక్ కాకపోవడం.. ఇప్పుడు ఒక్కసారిగా నీకు నేను.. నాకు నువ్వు.. అన్న రేంజ్‌లో కలిసి ముచ్చట్లు పెట్టుకోవడం పక్కా పొలిటికల్ స్టంట్ అంటున్నారు. వాళ్లిద్దరూ ఒకే తాను ముక్కలని మరోసారి గుర్తు చేస్తున్నారు.
ఇక, చంద్రబాబును, ఆయన ఫ్యామిలీని పర్సనల్‌గా అటాక్ చేసి.. ప్రతిపక్ష నేతను ఎమోషన్‌కు గురి చేసి.. వెక్కి వెక్కి ఏడ్చేలా చేసి నీచాతి నీచమైన రాజకీయం చేశారు జగన్‌రెడ్డి అండ్ బ్యాచ్. చంద్రబాబు అంతటి నేత అలా భోరున విలపించడం చూసి యావత్ రాష్ట్రం రగిలిపోయింది. కన్నీరు పెట్టింది. ధర్నాలు, నిరసనలు వెల్లువెత్తాయి. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈరోజు ఈరోజు.. అసెంబ్లీని రద్దు చేసి.. ఉన్నపళంగా ఎన్నికలు పెడితే.. జగన్‌రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలనే కసితో ఉన్నారు ఏపీ ప్రజలు. చంద్రబాబు-భువనేశ్వరి విషయంలో బాగా డ్యామేజ్ జరిగిందని గుర్తించిన జగన్‌రెడ్డి.. వెంటనే ఇలా కేసీఆర్‌ను కలిసి.. చిరునవ్వులు చిందించి.. మీడియా, ప్రజల అటెన్షన్‌ను అటువైపు తిప్పారా? అనే అనుమానమూ వస్తోంది. లేదంటే.. బిజీగా ఉండే ముఖ్యమంత్రులు.. సరిగ్గా ఒకే సమయానికి ఆ పెళ్లికి వెళ్లడం ఏంటి? ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి దగ్గర ఉదయం షర్మిల, సాయంత్రం జగన్‌లు ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టు.. జగన్-కేసీఆర్‌ల మధ్య నిజంగా వైరం ఉండి ఉంటే.. ఒకరు వెళ్లిపోయాక ఇంకొకరు వచ్చి ఉండేవారు. కానీ, కావాలనే.. కూడబలుక్కొనే అలా ఆ ఇద్దరూ చేతులు కలిపారని అంటున్నారు. ఇదంతా ప్రజలను పిచ్చోళ్లను చేసే పొలిటికల్ డ్రామా అని మండిపడుతున్నారు.