సంతోషాన్ని నింపుతున్న ఆర్బిఐ కొత్త నిర్ణయం...
posted on Oct 4, 2019 @ 4:19PM
ఆర్బిఐ గత కొంత కాలంగా ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తోంది.ఇప్పుడు ఆ సంతోషాన్ని పెంచటానికై ఆర్బిఐ మరోసారి మరింత వడ్డీరేట్లను తగ్గించింది. ఈ సారి ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించి ఐదు పాయింట్ ఒకటి ఐదు శాతానికి పరిమితం చేసింది. రివర్స్ రెపో రేటును నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గించింది. ఆర్బిఐ వడ్డీ రేట్లు తగ్గించడం వరుసగా ఇది ఐదోసారి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి దాకా వరుసగా ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తూ వచ్చింది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో వృద్ధి రేటును కూడా ఆరు పాయింట్ తొమ్మిది శాతం నుంచి ఆరు పాయింట్ ఒక శాతానికి తగ్గించింది ఆర్బిఐ.
గత నెలలో ఆర్థిక వృద్ధి రేటు ఐదు శాతానికి పరిమితం కావడం ఆశించిన మేరకు అంచనాల్ని అందుకోలేని పరిస్థితులు ఏర్పడటంతో వృద్దిరేటును అంచనాల్ని ఆర్బీఐ తగ్గించింది. అయితే రెండు వేల ఇరవై ఇరవై ఒక సంవత్సరానికి మాత్రం జిడిపి అంచనాలను ఏడు పాయింట్ రెండు శాతానికి సవరించింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆర్బిఐ నిర్దేశిత పరిధి కన్నా దిగువనే ఉండడం ఆర్థిక రంగానికి మరింత ఉద్దీపనాలు అందించాల్సిన అవసరం ఉన్నందున రెపో రేటును మరోసారి ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించారు. ప్రభుత్వం నుంచి మరోసారి ఆర్థిక ఉద్దీపనలకు అవకాశం చాలా తక్కువగా ఉన్నందువల్ల ద్రవ్య పరిమితి విధానం విషయంలో ఆర్బిఐ సానుకూల ధోరణితో వ్యవహరించిందని విశ్లేషకులు చెబుతున్నారు.ఈ వార్త విన్న ప్రజలు వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.