మంత్రి కేటీఆర్ సంతకం కూడా ఫోర్జరీకీ లోనైయ్యింది...

మనకు సాధారణంగా సంతకాల ఫోర్జరీ సంగతి తెలిసిందే.కానీ మన మంత్రి కేటీఆర్ సంతకం కూడా ఫోర్జరీకీ లోనైయ్యిందంట వివరాళ్లో కి వెళ్తే మంత్రి కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన హెడ్ మాస్టర్ మంగళ పై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆమెపై చర్యలకు డిమాండ్ చేస్తున్నాయి. నల్లగొండ జిల్లా రావులపెంట లోని బాలికల ఉన్నత పాఠశాలలో పని చేస్తోంది మంగళ. అది కూడా హెడ్ మాస్టర్ గా, అంతేకాదు జిల్లా లోని ఓపెన్ స్కూల్స్ ఇన్ చార్జిగా కూడా విధులు వెలగబెడుతుంది. రెండు వారాల క్రితం ఆమెను కో ఆర్డినేటర్ హోదా నుంచి తప్పించాలని ఆదేశాలొచ్చాయి. ఆ స్థానంలో మరో ఉపాధ్యాయుడిని నియమించాలని సూచించింది. అయితే తను మాత్రం ఆ పదవిలోనే ఉంటాను అని తనని కొనసాగించాలి అని డీఈఓని కోరింది.

కొంత గడువు ఇస్తే అందుకు ఆదేశాలు తెచ్చుకుంటానని డీఈఓకు చెప్పింది. అందుకు డీఈవో కూడా సరే అన్నారు. నాలుగు రోజులకు మంత్రి కేటీఆర్ ఇచ్చినట్టుగా ఓ సిఫార్సు లేఖలు అందించింది మంగళ. ఆ లెటర్ తో జిల్లా ఓపెన్ స్కూల్స్ ఇన్ చార్జిగా కొనసాగుతూ వుంది. విద్యావ్యవస్థకే మచ్చ తెచ్చిన మంగళ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. జిల్లా కో ఆర్డినేటర్ పోస్టింగ్ కోసం మంత్రి సంతకాన్ని లెటర్ ని తయారు చేసి ఫోర్జరీ చేయడం పట్ల జిల్లాలో కలకలం రేగింది. ఇప్పటికే ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా మండిపడుతున్నారు.ఒక పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మరి ఇలాంటి అనైతికమైనటువంటి చర్యలు చేయడం అనేది చాలా సిగ్గుచేటు అని టిఎస్సిటి అధ్యక్షుడు తెలిపారు.

Teluguone gnews banner