చర్చ పై రచ్చ
posted on Jul 16, 2015 @ 2:25PM
పాలమూరు ప్రాజెక్టుపై టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి.. టీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావుల మధ్య మాటాల తూటాలు పేలుతూనే ఉన్నాయి. మొదట ప్రాజెక్టు పై చర్చించేందుకు జూపల్లి ఎన్టీఆర్ భవన్ కు వస్తానని సవాల్ విసిరారు. అయితే తాను చర్చకు వెళ్లలేదు.. ఆతరువాత దానిపై రావుల స్పందించి జూపల్లి ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. జూపల్లి కోసం మూడు గంటలు ఎన్టీఆర్ భవన్ లో వేచి ఉన్నానని.. అయినా జూపల్లి రాలేదని.. సవాల్ విసిరి మొహం చాటేసారని ఎద్దేవ చేశారు. అయితే రావుల చేసిన వ్యాఖ్యలకు జూపల్లి స్పందించి చర్చకు నేను సిద్ధంగానే ఉన్నాను.. టైం మీరు ఫిక్స్ చేసినా పర్వాలేదు అని డైలాగులు విసిరారు.. అక్కడితో ఆగకుండా మళ్లీ టీడీపీ నేతలు తోక ముడిచారు.. చర్చకు రాలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రావుల జూపల్లి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. చర్చకు తామేప్పుడూ సిద్దమేనని.. కానీ చర్చ ఎప్పుడు, ఎక్కడ అనేది జూపల్లి ఏకపక్షంగా నిర్ణయిస్తే కుదరదని అన్నారు. ఆయన దారి తప్పిన, గతి తప్పిన విధంగా మాట్లాడుతున్నారని, ఇంతకు మించి తాను స్పందిస్తే తనకు సభ్యత అడ్డు వస్తుందన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని.. ఈ పథకం పూర్తి కావాలని తామూ కొరుకుంటున్నామని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకం వద్దని చంద్రబాబు లేఖ రాయలేదని, వైసీపీ అధినేత జగన్ రాశారని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున జూపల్లి ముందుగా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని, ఆ తర్వాత ఎన్ని రోజులైన చర్చ పెట్టుకోవచ్చన్నారు.