అధికార లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు
posted on Jun 8, 2024 9:00AM
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఒక మీడియా అధిపతికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగడం బహుశా దేశంలో ఇదే ప్రథమం.
సీడ్ల్బూసీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన తెలంగాఏణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామోజీ ఇక లేరన్న వార్త తెలియగానే అక్కడి నుంచే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. రామోజీ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలనీ,న అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రేవంత్ ఆదేశించారు. ఏర్పాట్ల పర్యవేక్షణను రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు.
రామెజీ మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్షర యోధుడు రామోజీరావు ఇక లేరన్న వార్త తనను కలచివేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన సంతాప సందేశంలో రామోజీ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. రామోజీరావు కుటుంబానిని తన తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.