రామోజీరావు ఆ పేరే ఒక బ్రాండ్!
posted on Jun 8, 2024 @ 9:34AM
రామోజీరావు.. ఆ పేరే ఒక బ్రాండ్ రామోజీ రావు పరిచయం అక్కర్లేని పేరు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ మృతి పూడ్చలేని లోటు. జర్నలిజం విలువలను పాటించిన రామోజీరావు. ఈనాడు పత్రిక ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకువచ్చారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లాలోని ఓ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రామోజీ అంచెంలంచెలుగా ఎదిగారు. సినీ నిర్మాతగా కూడా ఆయన సమాజానికి ఉపయుక్తమైన సినిమాలనే తీశారు. ఉషాకిరణ్ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా దాదాపు 80కి పైగా సినిమాలను ఆయన నిర్మించారు. ఆ తరువాత రామోజీ ఫిల్మ్ సిటీ ను నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పిల్మ్ సిటీ. అంతే కాదు ఇది గొప్ప పర్యాటక ప్రాంతంగా కూడా పరిగణించబడుతోంది. దేశం, ప్రపంచం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో పర్యటకులు రామోజీ ఫిల్మ్ సిటీ సొందర్శనకు వస్తున్నారంటేనే దాని గొప్పతనం అర్ధం చేసుకోవచ్చు. ఇక డిజిటల్ యుగంలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. దేశంలోనే మొట్టమొదటి రీజనల్ చానల్ ను ప్రారంభించినది రామోజీరావే. ప్రస్తుతం దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ వార్తలను ప్రసారం చేస్తున్న ఏకైక చానెల్ ఈటీవీ. మీడియా, జర్నలిజంలలో ఆయన అందించిన విశేష సేవలకు గాను రామోజీరావుకు 2016లో భారతదేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ వరించింది.