Read more!

చంద్రబాబుకు రామ్‌దేవ్ అభినందన

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడిని సుప్రసిద్ధ యోగా గురువు బాబా రామ్‌దేవ్ మంగళవారం నాడు హైదరాబాద్‌లో కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు రామ్‌దేవ్ బాబా ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. అభినందించిన రామ్‌దేవ్‌కి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా వుంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తన పతంజలి యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశంలో రామ్‌దేవ్ బాబా వున్నారని, దీనికి సంబంధించిన ప్రతిపాదనని చంద్రబాబుకు రామ్‌దేవ్ తెలియజేసి వుంటారని పరిశీలకులు భావిస్తున్నారు.