ఆడవాళ్ళని అవమానించిన వర్మ
posted on Nov 19, 2013 @ 3:55PM
నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో...అనే విధంగా ఉంటాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఎదో ఒక రకంగా ఎప్పడు వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతాడు వర్మ. అయితే వర్మకు అమ్మాయిల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో అనే విషయం ఇపుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఇటీవలే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ మాజీ భార్య సింగర్ నటి సుచిత్రా కృష్ణ మూర్తి తన జీవితంలో జరిగిన విషయాలను వెల్లడిస్తూ ‘డ్రామా క్వీన్' అనే పుస్తకం విడుదల చేసింది. ఇందులో ఆమె వర్మ గురించి రాసిన మాటలు సంచలనాలకు దారితీస్తున్నాయి. ఇంతకి వర్మ గురించి తెలిసిన ఆ మాటలు ఏమిటని అనుకుంటున్నారా...?
అయితే ఇంతకు ముందు ఒకసారి వర్మ దగ్గరకు సుచిత్ర వెళ్ళి తనను పెళ్ళిచేసుకోమంటూ పెళ్లి కోరిందట. దానికి సమాధానంగా వర్మ..."సుచిత్రా.. నీవు నన్ను తప్పుగా అర్ధం చేసుకున్నావు. మన ఆలోచనలు,ఆశయాలు వేరు.నీకోసం నా అభిప్రాయాలను మార్చుకోలేను. అంతేకాదు నాకు వివాహ వ్యవస్థ పై నమ్మకం లేదు. నేను మహిళలను కేవలం సెక్స్ కు పనికి వచ్చే పరికరాలుగా మాత్రమే చూస్తాను" అని నేరుగా సుచిత్ర మోహం మీదే చెప్పేయడంతో...ఏమి అనాలో తెలియక సుచిత్ర అక్కడ నుండి వెళ్ళిపోయిందని, తను రాసిన "డ్రామా క్వీన్" పుస్తకంలో తెలిపింది.
మరి ఈ వర్మ డైలాగులు మహిళా సంఘాల చెవిలో పడితే... ఎలా ఉంటది? ఎలా ఉంటది? ఒక్కసారి ఊహించుకోండి...!