నటుడు రామ్ చరణ్ ఫోటోలు మార్ఫింగ్ చేశారా!
posted on May 10, 2013 @ 10:42AM
బంజారాహిల్స్‌లో రామ్ చరణ్ సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను కొట్టిన సంగతి తెలిసిందే. సంఘటన పై లోకల్ మీడియాతో మాట్లాడిన చెర్రీ బాబు ఈ ఉదంతంలో తనది ఎలాంటి తప్పూ లేదని వ్యాఖ్యానించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే తనతో దురుసుగా ప్రవర్తించారని విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు తాను కారు దిగలేదని, తన ఫోటోలు మార్ఫింగ్ చేశారని ఆయన ఆరోపించారు. ఓ ఫోటో గ్రాఫర్ తనను బ్లాక్ మెయిల్ చేయబోయాడని చెప్పారు. కారులో తనతో సహా తన భార్య ఉపాసన ఉందన్నారు. తనతో గొడవ పెట్టుకున్న వారు ఐటీ ఉద్యోగుల్లా లేరన్నారు. వారు మద్యపానం సేవించి ఉన్నారన్న అనుమానాన్ని చరణ్ వ్యక్తం చేశారు. ఇక ఉద్యోగులు ఒక వార్త సంస్థలో మాట్లాడుతూ తమది ఎటువంటి పొరపాటూ లేదని వాపోయినప్పటికీ, వారు ఆ రోజు కేసు పెట్టకపోవడంతో…. ఇప్పుడు ఇంకేం మాట్లాడటానికి లేకుండాపోయే అవకాశం కనిపిస్తోంది!