ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వానలు
posted on Jul 20, 2024 @ 9:58AM
బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వాయవ్య దిశగా పయనించి.. పూరీ సమీపంలో శనివారం తెల్లవారు జామున తీరం దాటింది. ఆ తర్వాత క్రమంగా బలహీనపడుతోంది.
దీని ప్రభావంతో శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదాదవరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది.
గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు అనంతపురం, శ్రీ సత్యసాయి, వై.యస్.ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నూ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో అత్యవసర సహాయక చర్యల కోసం 3 ఎస్డీఆర్‌ఎఫ్, 2ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రో తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.