డుక్కుడుక్కు డుక్కని బుల్లెట్ పై వచ్చిన రాహుల్!
posted on Nov 27, 2022 @ 10:18PM
మధ్యప్రదేశ్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ఆయన ప్రసంగాలు, వేషధారణ ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నయి. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆయన చేస్తున్న విమర్శలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. రాహుల్ గాంధీ ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల కంటే సైద్ధాంతిక రాజకీయాలకు, ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. జోడో యాత్ర లక్ష్యం ఎన్నికల విజయం కాదని సమాజంలో ద్వేషభావాన్ని రూపుమాపిఐక్యతను సాధించడమేనని కాంగ్రెస్ మొదటి నుంచీ చెబుతూనే వస్తోంది.
అందుకు తగ్గట్టుగానే రాహుల గాంధీ కూడా తన ప్రసంగాలాలో బీజీపీ, ఆర్ఎస్ఎస్’జాతీయ వాద హిందుత్వ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా సైద్ధాంతిక విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బీజేపీ,ఆర్ఎస్ఎస్ ల వల్ల దేశానికి వాటిల్లే ముప్పు గురించి హెచ్చరిస్తున్నారు. హెచ్చరిస్తున్నారు. గత మూడు రోజులుగా రాష్ట్రంలో సాగుతున్న యాత్రలో ప్రింయాంకాగాంధీ, రాబర్ట్ వాద్రా పాల్గొనడం కొత్త చర్చకు తావిచ్చింది. అదలా ఉంటే ఆదివారం రాహుల్ గాంధీ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో జనం పాల్గొన్నారు. రాజ్యంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ జన్మస్థలమైన డాక్టర్ అంబేడ్కర్ నగర్ లో రాహుల్ గాంధీ పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది.
సాయంత్రానికి ఇండోర్ చేరుకున్న రాహుల్ అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు. ఇలా ఉండగా ఆదివారం నాటి యాత్రలో విశేషమేమిటంటే రాహుల్ గాంధీ కొద్ది దూరం బుల్లెట్ బైక్ నడిపారు. ఇది పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఆయన వెంట కార్యకర్తలు పరుగులు తీశారు. కాంగ్రెస్ జిందాబాద్ నినాదాలతో అంబేడ్కర్ నగర్ మార్మోగింది.