అన్నా చెళ్లెళ్లు ఒకే బైక్ పై.. బీహార్ లో కాంగ్రెస్ ర్యాలీ
posted on Aug 28, 2025 6:43AM
కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీహార్ లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముజఫర్‌పూర్‌లో ఆదివారం ఓట్ అధికార యాత్రలో భాగంగా జరిగిన బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ బైక్ ను స్వయంగా నడిపారు. ఆ బైక్ పై వెనుక ఆయన సోదరి, కాంగ్రెస్ సీనియర్ నేత, వాయనాడు ఎంపీ ప్రింయాంకా గాంధీ కూర్చున్నారు.
ఈ అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే బైక్‌పై ర్యాలీలో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ చేపట్టిన ఓట్ అధికర యాత్రకు విశేష స్పందన లభిస్తున్నది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి 65 లక్షల మందికి పేర్లను ఎన్నికల సంఘం తొలగించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటిమి ఈ ఓట్ అధికార్ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 17న ససారామ్‌లో ప్రారంభమైన ఈ యాత్ర మొత్తం 1,300 కిలోమీటర్ల మేర సాగి వచ్చేనెల 1న ముగియనుంది.