రాఫెల్ ఫెయిల్?.. పీఎల్ 15 హిట్?

పాకిస్థాన్ కి చైనా నిశ్శ‌బ్ధ సాయం ఎలా చేసింది?
మ‌న  రాఫెల్ చైనా సాయంతో పాక్ కూల్చేసిందా?
అస‌లు ఈ యుద్ధంలో చైనా దాని ఆయుధ పాత్ర ఏంటి?
రాఫెల్ పై వ‌స్తున్న ఆరోప‌ణ‌లు నిజ‌మేనా?
టెలిగ్రాఫ్ క‌థ‌న  సారాంశ‌మేంటి?
ఈ వ్యాసంపై వ‌స్తున్న అభ్యంత‌రాలు ఎలాంటివి?

పాకిస్థాన్ భార‌త యుద్ధ విమానాలు కూల్చ‌డంలో చైనా పాత్ర ఎలాంటిద‌న్న‌దొక చ‌ర్చ‌. అయితే చైనా చాప కింద నీరులా పాకిస్థాన్ కి అందించాల్సిన సాయ‌మంతా అందిస్తోన్న‌ట్టు పెద్ద పెద్ద అంత‌ర్జాతీయ ప‌త్రిక‌లు, వాటిలోని రాత‌గాళ్ళ క‌థ‌నాల ద్వారా తెలుస్తోంది. మ‌న‌మెంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే రాఫెల్ యుద్ధ విమానాల‌ను చైనా సాయంతో పాక్ పేల్చేసిన ఘ‌ట‌న తాలూకూ క‌థ‌నాలు.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్త‌ంగా ర‌క్ష‌ణ వ‌ర్గాల వారిని అట్టుడికిస్తోంది. టెలిగ్రాఫ్ లో వ‌చ్చిన ఓ క‌థ‌నం మేరకు.. ఆ రోజు ఉద‌యం 4 గంట‌ల‌కు ఒక అసాధార‌ణ ఘ‌ట‌న న‌మోద‌య్యింది. అది యుద్ధ భూమిలో కాదు.. దౌత్య ప‌ర‌మైన విష‌యంలో.  పాక్ లోని చైనా రాయ‌బారి రావ‌ల్పిండికి అత్య‌వ‌స‌రంగా ఫోన్ చేశారు. త‌ర్వాత కొన్ని గంట‌ల్లోనే భ‌రత వైమానిక బ‌లాన్నది బ‌ద్ధ‌లు కొట్టేసింది.

భార‌త వైమానిక ద‌ళం రోజుల త‌ర‌బ‌డి స‌మావేశ‌మ‌వుతోంది. దాదాపు 180 విమానాలు ప‌శ్చిమ స‌రిహ‌ద్దులో కేంద్రీకృత‌మై ఉన్నాయి. ల‌క్ష్యం ఎంతో స్ప‌ష్టంగా ఉంది. బాలాకోట్ ను పున‌రావృతం చేయ‌డ‌మే టార్గెట్. పాకిస్థాన్ ర‌క్ష‌ణ గోడ‌ల‌ను విచ్చిన్నం చేయ‌డం.. వ్యూహాత్మాక ఆధిప‌త్యాన్ని పున‌రుద్ద‌రించ‌డం.

కానీ యుద్ధం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. యుద్ధ విమానాలు ఎగిరే ఆకాశాలు కూడా ఎప్పుడూ నీలిరంగులోనే ఉండ‌వు. అప్పుడ‌ప్పుడూ త‌న రూపును షేపును.. మార్చుకుంటూ ఉంటుందా వార్ స్కై. భార‌త వైమానిక ద‌ళం ఎప్పుడూ ప్ర‌వేశ ద్వారాలు దాట లేదు. దాని అవ‌త‌ల ఏముందో వారికి ఎంతో స్ప‌ష్టంగా  తెలుసు. 

చైనా J-10C ఫైటర్లు, అధునాత‌న PL-15 క్షిపణులు, 300 కి.మీ కంటే ఎక్కువ పరిధి కలిగిన మాక్ 5 హంట‌ర్స్, షూట‌ర్ ఎవ‌రైనా త‌మ ప‌రిధిలోకి తేగ‌లిగే.. ఏరియల్ రాడార్లు.. బేసిగ్గా భార‌త్ కేవ‌లం పాకిస్థాన్ పైలెట్ల‌ను మాత్ర‌మే చూడ‌దు. ఇది స్కార్దు నుంచి ప‌స్నీ వ‌ర‌కూ విస్త‌రించి ఉన్న చైనా వైమానిక సామ‌ర్ధ్యాన్ని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక త‌ప్ప‌దు.
 
అయితే చైనా ఇచ్చిన ఈ స‌పోర్టుతో సుమారు 250 మిలియ‌న్ల‌కు పైగా విలువైన ఒక రాఫెల్ ని గాల్లోనే కూల్చి వేసిన‌ట్టు స‌మాచారం. మ‌రొక‌టి అతి త్వ‌ర‌గా తిరిగి వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది. దీన్ని కాపాడ్డానికి ఉప‌యోగించే  స్పెక్ట్రా EW వ్యవస్థ సైతం నిర్వీర్య‌మైంది. PL-15 రాడార్‌తో రాలేదు. ఇది AI- గైడెడ్ సైలెన్స్ ద్వారా వచ్చిన‌ట్టు స‌మాచారం. 

చైనా వార్ ఫేర్ కేవ‌లం స్కై, స‌ర్ఫేస్ ద్వారా మాత్ర‌మే సాగేది కాదు. దాని రేంజే వేరు. అది ఏకంగా స్పేస్ ద్వారా వార్ ని ఆప‌రేట్ చేయ‌గ‌ల‌దు. ఆ స్థాయికి ఎప్పుడో త‌న యుద్ధ విన్యాసాన్ని సిద్ధం చేసి ఉంచింది డ్రాగ‌న్ కంట్రీ. అందులో భాగంగా చైనా  ఉపగ్రహాలు, AWACS సహాయంతో పాకిస్తాన్ వైమానిక దళం సెన్సార్- ఫ్యూజన్ కిల్‌ను అమలు చేసింది. రాఫెల్స్‌కు ఎప్పుడూ ఈ దిశ‌గా సిగ్న‌ల్స్ రాలేదు, వారి ప్రత్యర్థిని కూడా అవి చూడ‌లేక పోయాయి. క్షిపణులు ఢీకొడుతున్న విష‌యం తెలిసే లోప‌లే క‌థ ముగిసిపోయింది.

భార‌త్ కు ఒక విష‌యం స్ప‌ష్టంగా తెలుసు. ఒక రాఫెల్ ని ప‌డ‌గొట్ట‌గ‌లిగితే ఐదింటినీ కూడా ప‌డగొట్టొచ్చు. అందుకే వారు స‌రిహ‌ద్దుల‌కు మూడు వంద‌ల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్నారు. వారికి ధైర్యం లేక పోవ‌డం వ‌ల్ల కాదు.. అక్క‌డున్న స్థితిగ‌తుల మీదున్న అవ‌గాహ‌న వ‌ల్ల‌.
 
దీని ప్ర‌భావం ఏమంత త‌క్కువైన‌ది కాదు. ఇది భార‌త‌దేశ ప్ర‌తిష్టాత్మ‌క రాఫెల్, పాకిస్థాన్ జెట్ ప్ర‌యోగించిన ఒక చైనా క్షిప‌ణి దెబ్బ‌కు ప‌డిపోయిందంటే.. కేవ‌లం యుద్ధ వ్యూహం మాత్ర‌మే కాదిది.. ఒక భౌగోళిక రాజ‌కీయ సందేశం కూడా.

బ్లూమ్‌బెర్గ్ వంటి కొంద‌రు నిపుణులు చెప్పేదాన్ని బ‌ట్టిచూస్తే ఇది చైనా పాక్ స‌మ‌గ్ర యుద్ధానికి ప్ర‌త్య‌క్ష ప్ర‌ద‌ర్శ‌న‌. ఈ చైనా మార్క్ వార్ స్ట్రాట‌జీకి పెద్ద పెద్ద పాశ్చాత్య యుద్ధ విశ్లేష‌కులు కూడా ఆశ్చ‌ర్య పోయారు. ఫ్రెంచ్ ర‌క్ష‌ణ ఒప్పందాలు ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డ్డాయి. స‌రిగ్గా అదే స‌మ‌యంలో  చైనా చిరున‌గ‌వులు చిందిస్తోంది. మేమంతా నిశ్శ‌బ్ధంగానే చేస్తాం. మీలా సౌండ్ చేయం. అది మేమైనా మా పీఎల్ ఫిఫ్టీన్ త‌ర‌హా క్షిప‌ణులైనా.. అంతా సౌండ్ లెస్ అన్న మెసేజ్ పాస్ చేస్తోంది చైనా.

వార్ గేమ్ మొత్తం మారిపోయేలాంటి సీన్. ఇది 2019 కాదు.. బాలాకోట్ దాడి స‌మ‌యం అంత‌క‌న్నా  కాదు. యుద్ధ వ్యూహం ఎంతో ముదిరిపోయిన 2025లో ఉన్నాం. నాటి నుంచి నేటి వ‌ర‌కూ మారిన ప్ర‌పంచ యుద్ధ నీతి అసాధార‌ణ‌మైన‌ది. ఇప్పుడు మ‌నం.. ఆయుధం క‌నిపిస్తుంది- కానీ శ‌తృవు క‌నిపించ‌ని మాయా యుద్ధాన్ని చూస్తున్నాం. వ‌చ్చే రోజుల్లో చైనా బేస్ చేసుకుని మ‌ల‌చ‌బ‌డుతోన్న వ్యూహంలో.. ఆయుధం, శ‌తృవు రెండు క‌నిపించ‌ని మ‌రింత మాయామేయ యుద్ధాన్ని చూడ‌బోతున్నాం.. అది వేరే సంగ‌తి.

చైనీకృత‌మైన పాక్ వైమానిక స్థ‌లంలోకి ప్ర‌వేశించే సాహసం చేస్తే..  J-10Cలు, PL-15లు వేసే డెడ్లీ స్కెచ్ లోకి కోరి వెళ్ల‌డ‌మే అవుతుంది. ఈ విష‌యం భార‌త్ కి బాగానే తెలుసు. 

కాబ‌ట్టి భార‌త్ త‌ప్ప‌క వెన‌క్కి త‌గ్గి తీరాల్సిందే అన్న సిట్యువేష‌న్. మా ఆయుధం అక్క‌ర్లేదు- భ‌యం చాలు అన్న‌ట్టుగా అటు వైపు ఆట  మొద‌లై పోయింది. రాడార్ అంధ‌త్వం, నిశ్శ‌బ్ధ వ్యూహం ద్వారా భార‌త్ ని క‌ట్టి  ప‌డేసింది చైనా అధీకృత పాక్ వార్ ఫీల్డ్.
 
ఇది భార‌త పైలెట్ల నైపుణ్య లేమికి సంబంధించిన ప‌రాజ‌యం కాదు. ఆ పైలెట్ యుద్ధ భూమిలో చూడ‌లేని ఒక గాడాంధ‌కారం కార‌ణంగా ఫెయిల్ అవుతున్నాడు. ఇది ఉప‌గ్ర‌హ నిర్మిత యుద్ధం. సెన్సార్ల ద్వారా అనుసంధానించ‌బ‌డిన  యుద్ధం. అక్క‌డెక్క‌డో చైనాలో కూర్చుని ఆప‌రేట్ చేస్తే ఆ సిగ్న‌ల్ చైనా శాటిలైట్లు అందుకుని.. ఇక్క‌డి యుద్ధ‌ యంత్రాల‌కు ప‌ని చెబుతాయి. ఆ యంత్రాలు కంటికి  క‌నిపించ‌కుండా వ‌చ్చి.. ఢీ కొట్టేస్తాయి. ఇదీ ఇక్క‌డ అమ‌లు చేస్తోన్న అస‌లు సిస‌లైన యుద్ధ వ్యూహం.
 
2025 మేలో భార‌త్ పాక్ మ‌ధ్య జ‌రుగుతోన్న ఈ యుద్ధంలో వార్ గేమ్ మొత్తం ఛేంజ్ అయిపోయింది. 36 జెట్ ఫైట‌ర్ల కొనుగోలు ద్వారా భార‌త్ నిర్మించుకున్న వైమానిక ఆధిప‌త్య‌పు క‌ల ఒక్క‌సారిగా కాశ్మీర్ కొండ‌ల్లో ద‌భేల్మ‌ని కూలిపోయిందని అంటుంది మెంఫిస్ బార్క‌ర్ రాసిన క‌థ‌న సారాంశం.

ఇది వ్యూహాత్మ‌క యుద్ధం, న్యాయ‌పోరాటానికి సంబంధించిన యుద్ధం కాదు. ఒక సైద్ధాంతిక స‌మ‌రం. దానిక తాలూకూ ప‌త‌నం. ఇక్క‌డ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న యుద్ధ  ఆధిప‌త్య పోరు.. అడ్వాన్స్డ్ టెక్నాల‌జీ అమ‌లుకు సంబంధించిన అంశం. ఈ విష‌యాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న యుద్ధ ఆయుధ మేథావులంతా క‌ల‌సి.. రియ‌ల్ టైమ్ లో అస‌లు విష‌య‌మేంటో ప‌రిగ్ర‌హిస్తున్నారు. ప‌రిశీలిస్తున్నారు.

రాఫెల్ ఒక అన్ ట‌చ‌బుల్. దాని రేంజ్ నెక్స్ట్ లెవ‌ల్. దాని టెక్నాల‌జీ తిరుగులేనిది. దాని పైలెట్లు వ‌ర‌ల్డ్స్ బెస్ట్. వారి రేంజే వేరు అనే బిరుదులు, విశేష‌ణాలెన్నో. అలాంటి రాఫెల్ ప్ర‌స్తుతం చైనా వేసిన ఉచ్చులో చిక్కింది. ఇక అది త‌ప్పించుకోలేదు. దాని టైం బ్యాడ్ డే రోజున.. ఖ‌చ్చితంగా ఫాల్ డౌన్ కావ‌ల్సిందే అన్న థియ‌రీకి సంబ‌ధించిన వ్య‌వ‌హార‌మిది.

అంద‌రూ అనుకున్న‌ట్టు చైనా ఏం చూస్తూ ఊరుకోవ‌డం లేదు. ఈ యుద్ధంలోకి నిశ్శ‌బ్ధంగానే అడుగు పెట్టింది. కొంద‌రు పాశ్చాత్య విశ్లేష‌కులు త‌మ‌కు అనువుగా మార్చి రాసుకున్న యుద్ధ వ్యూహాలు సిద్దాంతాల‌కిక్క‌డ తావు లేదు. ఇక్క‌డొక వార్ ఆల్రెడీ జ‌రుగుతోంది. చైనా అపార‌మైన సైనిక శ‌క్తికి దీటుగా ఇప్ప‌టికే ఏఐ బేస్డ్ స్మార్ట్ వార్ గేమ్ త‌యారు చేయాల‌న్న కృత‌నిశ్చ‌యంతో పాశ్చాత్య దేశాలుండ‌గా.. వాటికి పాక్ వంటి  యుద్ధ  క్షేత్రం వేదిక‌గా గ‌ట్టి బ‌దులు ఇవ్వాల‌న్న ఆలోచ‌నతో చైనా వార్ మైండ్ లో.. బ్లైండ్ గా ఫిక్స‌యిన‌ట్టు తెలుస్తోంది.
 
నిశ్శబ్దంగా గస్తీ తిరుగుతున్న సబ్ ఎరియ‌ల్ AWACS, నిష్క్రియాత్మక రీతిలో ఎగురుతున్న J-10C యుద్ధ విమానాలు, PL-15E క్షిపణులు 300 కి.మీ కంటే ఎక్కువ దూరంలోని  మాక్ 5 వేగంతో దేశీయ వేరియంట్లు లాక్ చేసి ఉంచారు. అందులో భాగంగా రాఫెల్ ఒక‌టి చిక్కి శ‌ల్య‌మైందని అంటున్నారు.  

ఒక క్షిప‌ణి త‌న‌కు 50 కిలోమీట‌ర్ల దూరంలోకి వ‌చ్చే వ‌ర‌కూ.. తానే దాని టార్గెట్ అని ఆ రాఫెల్ కి తెలియ‌దు. ఆ వేగంతో పోటీ ప‌డ్డానికి భార‌త పైలెట్ కి కేవ‌లం 9 సెక‌న్లు మాత్ర‌మే ఉన్నాయ్. స్పందించ‌డానిక‌ది స‌రిపోలేదు. దీంతో రాఫెల్ నేల‌మ‌ట్టం కాక త‌ప్ప‌లేద‌ని చెబుతోంది టెలిగ్రాఫ్ క‌థ‌నం.

ఇక‌పై కాశ్మీర్ లోని భార‌త వైమానిక ద‌ళాన్ని ర‌క్షించుకోవ‌డం సాధ్యం కాదు. ఎందుకంటే ఒక ఫైట‌ర్ జెట్ ఎగిరిన  ప్ర‌తిసారీ పాకిస్థాన్ రాడార్లు దాన్ని వెంట‌నే ప‌సిగ‌ట్టేస్తాయి. పీఎల్ ఫిఫ్టీన్ ద్వారా దాన్ని సౌండ్ లెస్ గానే ఢీకొట్టేస్తుందని హెచ్చ‌రిస్తోందీ క‌థ‌నం.

ప్ర‌స్తుతం ప్రపంచం ఈ యుద్ధ  ప‌త‌నాన్ని ఆయుధ విన్యాసాన్ని త‌న రెండు క‌ళ్లతో చూస్తోంది. డ‌స్సాల్ట్ ఏవియేష‌న్ షేర్ ధ‌ర  స్థ‌బ్ధుగా ఉండ‌గా.. చైనా డిఫెన్స్ స్టాక్స్ అయిన  AVIC, ALD చెంగ్డు ధ‌ర‌లు  పెరుగుతున్నాయనీ తెలుస్తోంది.

ఎందుకంటే C4ISR ఆధిపత్యం - కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్, కంప్యూటర్లు, ఇంటెలిజెన్స్, నిఘా ద్వారా ఇదంతా నిర్ణయించబడిన‌ట్టు అభిప్రాయ ప‌డుతున్నారు నిపుణులు.

ఇప్పుడు భార‌త్ పాక్ కంటే ముందుకు వెళ్ల‌లేదు. అది భార‌త్ ని ఎప్పుడో మించి పోయింది. భార‌త్ ఆశ్చ‌ర్య‌పోయేలోప‌ల‌.. దాని వార్ బ‌ర్డ్స్ ని అదెప్పుడో నేల మ‌ట్టం చేసేసింది. భార‌త్ కి క‌లిగించే ఈ వార్ పెయిన్ పాక్ ఈ ప్ర‌పంచానిక తెలియ చేస్తోన్న చైనా సైనిక సామ‌ర్ధ్య సందేశంగా భావించాల్సి ఉంటుందని చెబుతోంది టెలిగ్రాఫ్ క‌థ‌నం.
 
ఈ వార్ క‌మ్ మైండ్ గేమ్ లో ఇప్పుడు భార‌త్ పాక్ కేవ‌లం నిమిత్త మాత్రం. మిగిలిన‌దంతా చైనా వ‌ర్సెస్ యూఎస్, యూకే వంటి పాశ్చాత్య దేశాల మ‌ధ్య జ‌రిగే సంకుల స‌మ‌రం. అందుకే ఈ విష‌యంలోకి అంత తేలిగ్గా అడుగు పెట్ట‌కూడ‌ద‌నుకున్నారు మోడీ. మ‌న ద‌గ్గ‌రున్న ఫ్రెంచ్ రాఫెల్స్, ర‌ష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్స్ కి దీటుగా చైనా త‌న అస్త్ర‌శ‌స్త్ర విన్యాస‌మంతా ముందుకు తెచ్చింది. అది నేరుగా శ‌తృవును ఢీ కొట్ట‌డం లేదు. ఎక్క‌డో అంత‌రిక్ష కేంద్రంగా త‌న  వార్ గేమ్ స్టార్ట్ చేస్తోంది. పాకిస్థాన్ అన్న‌దొక భుజం మాత్ర‌మే. భార‌త్ ఒక ఆబ్జెక్ట్ మాత్ర‌మే. దాని గురి వేరు. దాని ల‌క్ష్యం వేరని అంటోంది టెలిగ్రాఫ్ క‌థ‌నం.

ఇపుడే స్పెక్ట్రా వ్య‌వ‌స్థ కూడా దాన్ని గుర్తించ‌లేదు. ఉప‌గ్రహం ద్వారా ఆప‌రేట్ అయ్యే ఆ క్షిప‌ణిని ఏ EW సూట్ కూడా మోసగించ‌లేదు. ఏ ఫైట‌ర్ జెట్ కూడా రాబోయే మ‌ర‌ణ స‌మ‌యాన్ని క‌నీసం ఊహించ‌లేదు. ఆకాశ‌మిప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇది వైమానిక వైమానిక యుద్ధ ముగింపు కాదు. నిశ్శ‌బ్ధ,  అదృశ్య‌, జ‌వాబు చెప్ప‌న‌ల‌వి  కాని వైమానిక ఆధిప‌త్యానికి సంబంధించిన ఘ‌న ప్రారంభంగా అభివ‌ర్ణిస్తున్నారు అంత‌ర్జాతీయ యుద్ధ వ్య‌వ‌హారాల నిపుణులు.

ఇది టెలిగ్రాఫ్ క‌థ‌న సారాంశం కాగా. దీనిపై ప్ర‌తిస్పంద‌న‌లు సైతం తీవ్రంగానే వ‌స్తున్నాయి. ఇదొక ఊహాజ‌నిత క‌ల్పిత గాథ అని అభివ‌ర్ణిస్తున్నారు కొంద‌రు యుద్ధ  నిపుణులు. ఇది కేవ‌లం రాఫెల్ పై బుర‌ద‌జ‌ల్లే క్ర‌మ‌మ‌ని. ఈ ఉచ్చులో చిక్క‌రాద‌న్ని వీరి వాద‌న‌. అయితే పీఎల్ 15 క్షిప‌ణుల‌ను చైనా పాక్ కి ఇచ్చిన మాట నిజ‌మే అయినా రాఫెల్ విమానాలు కూల్చిన‌ట్టు ఎక్క‌డా ఆధారాలు లేవ‌న్న మాట వినిపిస్తోంది.

చంద్రబాబు.. విజన్ ఎహెడ్.. 2047 అండ్ బియాండ్!

అందరూ రేపటి గురించి ఆలోచిస్తే.. చంద్రబాబు రెండు  దశాబ్దాల ముందు గురించి ఆలోచిస్తారు. అదీ ఆయన విజన్. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ రోజే ప్రణాళికలు రూపొందిస్తారు. అదీ ఆయన దూరదృష్టి. అందుకే రెండు దశాబ్దాలకు ముందు ఆయన విజన్ 2020 అన్నారు. ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులూ కూడా చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ ను, దూరదృష్టినీ ప్రశంసిస్తారు. రాజకీయ విభేదాలతో మరుగుల పడేయాలని ప్రయత్నించిన నేతలూ ఉన్నారనుకోండి. వారి ప్రయత్నాలు విఫ లమై వారే మరుగుల పడే పరిస్థితికి రావడం మనం చూస్తున్నాం. సంక్షోభాల నుంచీ అవకాశాల అన్వేషించే అభివృద్ధికాముకుడు చంద్రబాబు. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు, సృజన, ఆలోచనలు, సంస్కరణలతో అందరినీ అబ్బుర పరుస్తుంటారు. ప్రభుత్వ కార్యాలయాలలో కంప్యూటర్లు, బయోమెట్రిక్ అటెండన్స్ ఇవన్నీ చంద్రబాబు ముందు చూపునకు నిదర్శనాలే.  వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను, పథకాలను ప్రజలకు అరచేతిలో పెట్టిన ఘనత కూడా చంద్రబాబుదే.  ఇప్పుడు తాజాగా మరింత మెరుగ్గా ప్రజలకు సేవలు అందించేందుకు   స్పీడ్ అఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు చంద్రబాబు.   ఇందు కోసం కార్యాచరణ కార్యాచరణ రూపొందించాలని   ఉన్నతాధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. స్వర్ణాంధ్ర లక్ష్యాలు, 10 సూత్రాల అమలుపై సచివాలయంలో  సిఎస్ విజయానంద్ పాటు ఆయా  శాఖల ఉన్నతాధికారులతో  బుధవారం (డిసెంబర్ 24) భేటీ అయిన చంద్రబాబు  స్పీడ్ అఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానంపై వారికి దిశా నిర్దేశం చేశారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానం  ద్వారా పౌరులకు వేగంగా, మెరుగైన సేవలు అందించాలన్న ఆయన ఆ మేరకు కార్యాచరణ రూపొందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సుస్థిర అభివృద్ధి, అదే సమయంలో స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధన కోసం తీసుకోవలసిన చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించిన చంద్రబాబు, ప్రభుత్వ శాఖల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలని, తక్కువ ఖర్చుతో ఇంధనం, విద్యుత్, రవాణా, నీటి భద్రత వంటి సేవలను అందించడమే లక్ష్యంగా ప్రణాళికల రూపకల్పన తదితర అంశాలపై అధికారులకు స్పష్ట మైన లక్ష్యాలను నిర్దేశించారు.  జీరో పావర్టీ, మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, టెక్నాలజీ వంటి అంశాల ఆధారంగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అధికారులను ఆదేశించారు.

అట‌ల్, పీవీ.. పోలిక‌లు.. వ్యత్యాసాలు!

ఒకే నెలలో ఇద్ద‌రు దిగ్గ‌జాల జ‌యంతి, వ‌ర్ధంతి. తేడా ఏంటో చూస్తే డిసెంబ‌ర్ 25న వాజ్ పేయి జ‌యంతి. ఈ ఉత్స‌వాలు ఎలా జ‌రుగుతున్నాయి? అదే పీవీ వ‌ర్ధంతి ఎలా జ‌రిగింది? అన్న వ్య‌త్యాసం చూస్తే.. ముందుగా  ఈ ఇద్ద‌రి మధ్యా పోలికలను ఒక సారి గుర్తుచేసుకోవాలి.   అట‌ల్ బీహారీ  వాజ్ పేయి, పీవీన‌ర‌సింహ‌రావు  ఇద్ద‌రిదీ దాదాపు ఒక‌టే వ‌య‌సు అనే కంటే సమకాలీనులు అనడం బెటర్. 1924లో వాజ్ పేయి జన్మించారు.  1921లో పీవీ జన్మించారు. ఇక వీరి రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే.. వాజ్ పేయి 1957లో బ‌ల‌రాంపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించి  ఎంపీగా పార్ల‌మెంటులో అడుగు పెట్టారు. అదే ఏడాది పీవీ మంథ‌ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా  గెలిచారు. అట‌ల్ మొద‌టి నుంచి జాతీయ రాజ‌కీయాల్లోనే రాణిస్తూ రాగా.. పీవీ  తొలుత రాష్ట్ర రాజ‌కీయాలలో రాణించి, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. ఆ తరువాతే కేంద్ర మంత్రిగా జాతీయ రాజకీయాలలోకి అడుగుపెట్టారు. అట‌ల్, పీవీ ఇద్ద‌రూ  క‌వులే. మంచి వ‌క్త‌లే. అయితే వాజ్ పేయి ప్ర‌సంగాల‌కు వ‌చ్చిన గుర్తింపు పీవీకి రాలేద‌నే  చెప్పాలి. వాజ్ పేయి ఆర్ఎస్ఎస్ నేప‌థ్యం క‌లిగి ఉండ‌టం, అది కూడా ప్ర‌తిప‌క్షంలో ఉండ‌టంతో .. ఆయ‌న వ‌క్తృత్వ ప్రతిభ ప్రజలను ఆకట్టుకుంది.   అట‌ల్ ప్ర‌సంగిస్తుంటే, అంద‌రూ శ్ర‌ద్ధ‌గా  వినేవారు. కోట్లాది  మంది అట‌ల్ ప్ర‌సంగాలకు అభిమానుల‌య్యారు. ఇక్క‌డ అధికార విప‌క్షాల‌న్న  తేడా  క‌నిపించేది కాదు. పీవీ కాంగ్రెస్ లో ఉన్నందు వ‌ల్లో ఏమో ఇందిర ముందు మ‌రే నాయ‌క‌త్వం ఎద‌గ‌డానికి వీలు లేని ప‌రిస్థితుల మ‌ధ్య 1991 త‌ర్వాత మాత్ర‌మే పీవీ ప్ర‌సంగాలు ఎక్కువ‌గా వెలుగులోకి వ‌చ్చాయి.   ఇక్క‌డ ఈ ఇద్ద‌రికీ  మ‌ధ్య గ‌ల మ‌రో పోలిక ఏంటంటే.. వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా  ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే..   పీవీ  నాన్ గాంధీ  కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి  ఏలి రికార్డు సృష్టించారు. ఈ విషయంలో  ఇద్దరూ కూడా చరిత్ర సృష్టించారు.  వాజ్ పేయిని ఆయ‌న పార్టీ  ఇత‌ర నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఇప్ప‌టికీ త‌మ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. అదే పీవీ ప‌రిస్థితి అలా లేదు. ఆయ‌న‌కు పార్టీ ఇచ్చిన  గౌర‌వం అంతంత  మాత్ర‌మే. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే 2018 ఆగస్టు 16న అటల్ బిహారీ వాజపేయి మరణించారు. ఆయనకు ఆయన పార్టీ అంతా ఒక్కటై ఘన నివాళులర్పించింది. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా  వాజ్ పేయి అంతిమ యాత్రలో పాల్గొని  4 కిలో మీటర్లు నడిచారు. ఆయన పాడె మోశారు.   ఇక పీవీ విషయానికి వస్తే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పీవీ నరసింహారావు మరణించారు.  డిశంబర్ 23, 2004న ఆయన మరణించిన సమయంలో  ఆయన అంతిమ సంస్కారానికి పార్టీ అగ్రనేతలెవరూ హాజరు కాలేదు. ఆయన ఢిల్లీలో మరణించినా, పార్టీ కార్యాలయంలోనికి ఆయన పార్థీవదేహానికి ప్రవేశం లేకుండా పోయింది. ఇక అంత్యక్రియలు కూడా ఢిల్లీలో కాకుండా హైదరాబాద్ లో నిర్వహించారు.   అట‌ల్ బిహారీ వాజ్ పేయి జ‌యంతి సంద‌ర్భంగా ఏపీ అమ‌రావ‌తిలో ఆయ‌న స్మృతివ‌నం ఏర్పాటు చేయ‌డంతో పాటు.. విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్రమాలు నిర్వ‌హిస్తున్నారు.. ఈ కార్య‌క్ర‌మానికి మాధ‌వ్ వంటి బీజేపీ నేత‌ల‌తో పాటు.. ఏపీ  సీఎం చంద్ర‌బాబు  స‌హా ప‌లువురు హాజ‌ర‌య్యారు. ఇదిలా ఉంటే శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగా.. ఇప్ప‌టికే ధ‌ర్మ‌వ‌రం నుంచి ఏలూరు వ‌ర‌కూ ప‌లు ప్రాంతాల్లో అట‌ల్ జీ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌లు చేశారు. అట‌ల్- మోడీ సుప‌రిపాల‌నా  యాత్ర సైతం నిర్వ‌హించి అట‌ల్    ప్రేమాభిమానాలు కురిపించారు. కానీ పీవీ విష‌యంలో   ఆయ‌న వ‌ర్ధంతి సంద‌ర్భంగా  ఖ‌ర్గే చిన్న ట్వీట్ తో స‌రిపెట్టారు. ద‌టీజ్ డిఫ‌రెన్స్ బిట్వీన్ కాగ్రెస్ అండ్  బీజేపీ  అంటూ ప‌లువురు ఈ వ్యత్యాసాల‌ను ఎత్తి చూపుతున్నారు.  

అమరావతిలో వాజ్ పేయి విగ్రహం.. ఆవిష్కరించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్   రాజధాని అమరావతిలో   మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ముఖ్య మంత్రి చంద్రబాబు గురువారం (డిసెంబర్ 25) ఆవిష్కరించారు.  డిసెంబర్ 25న వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని అమరావతిలోని వెంకటపాలెంలో చంద్రబాబు ఆవిష్కరిం చారు. రాజకీయాలలో అజాతశత్రువుగా గుర్తింపు పొందిన వాజ్‌పేయి విగ్రహాన్ని అమరావతిలో తొలి విగ్రహంగా నెలకొల్పడం.. ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయం పెరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.   వాజ్ పేయీ శతజయంతి ఉత్సవాలలొ భాగంగా ఆయన జయంతి రోజున  వెంకటపాలెంలో  వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. వాజ్ పేయితో తనకు ఉన్న అనుబంధాన్ని నమరువేసుకున్నారు. వాజ్ పేయి హయాంలో ఆంద్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన అందించిన సహాయ సహకారాలను గుర్తు చేసుకున్నారు.  14 అడుగుల ఎత్తులో  అమరావతిలో ఏర్పాటు చేసిన ఈ కాంస్య విగ్రహావిష్కరణ  కార్యక్రమానికి  కేంద్ర మంత్రులు భూపతి శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్,  శివ రాజ్ సింగ్ చౌహాన్, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.  

క‌ర్ణాటకం.. ఎండ్ లెస్!

కొండంత రాగం తీసి కూసింత పాట పడిన సామెతలా తయారైంది క‌ర్ణాట‌క అధికార  మార్పు వ్య‌వ‌హారం. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌ర ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా డీకే శివ‌కుమార్  తనకు సీఎం పీఠం కోసం ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేశారు. అధిష్టానం ఓకే అంటే  త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేదు. ఏ విష‌యం త్వ‌ర‌గా తేల్చండ‌ని సీఎం సిద్ద‌రామ‌య్య సైతం అన్నారు.  ఈ నాన్చుడు ధోర‌ణి ప్రభావం పాల‌న‌పై ప‌డ‌కూడ‌ద‌ని సిద్దరామయ్య చెప్పారు.  కొంత కాలం పాటు బెంగ‌ళూరు టు ఢిల్లీ అన్నట్లుగా ప్ర‌త్యేక ఎపిసోడ్లు న‌డిచాయి. రాహుల్ గాంధీ డీకేకి  స్పెష‌ల్ మెసేజీలు పెట్టారు.  క‌ట్ చేస్తే ఏదో  అనుకుంటే ఏమీ కాలేదు అన్నట్లుగా  క‌ర్ణాట‌క‌లో సీఎం మార్పు జరగలేదు. కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది.  అయితే దీనికి సంబంధించి ఢిల్లీ  క‌ర్ణాట‌క భ‌వ‌న్ లో జ‌రిగిన మీడియా సమావేశంలో డీకే విలేకరులు  సంక్రాంతి త‌ర్వాత చ‌ర్చ‌లు ఉంటాయట నిజమేనా అని అడిగారు. దీనికి డీకే ఒకింత అసహనం, మరింత ఘాటు కలగలిపిన సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో సీఎం మార్పునకు సంబంధించిన చర్చలు  మీడియాలో త‌ప్ప మా మ‌ధ్య జ‌ర‌గ‌డం లేద‌న్న డీకే.. అక్కడితో ఆగకుండా,   అన్ని విష‌యాలు  చెప్పుకునేవి కావ‌ని కూడా వ్యాఖ్యానించారు. దీంతో కర్నా టక సీఎం మార్పు వ్యవహారం  ముగిసిపోయిందా? అన్నచర్చ జోరందుకుంది. దానికి తోడు డీకే మ‌రి కొన్ని కీల‌కమైన  కామెంట్లు కూడా చేశారు. త‌న‌కు అధికారం క‌న్నాకాంగ్రెస్  కార్య‌క‌ర్త‌గా ఉండట‌మే ఎక్కువ ఇంట్ర‌స్టన్నారు. 80వ దశకం నుంచీ  తానిలాగే హ్యాపీగా ఉన్నానన్నారు. తామంతా అంటే, డీకే, సిద్ధూ, ఇత‌ర కార్య‌క‌ర్త‌లంద‌రం క‌ల‌సి కాంగ్రెస్ ఇక్క‌డ అధికారంలోకి రావ‌డానికి  కృషి చేశామ‌నీ.. అలాగ‌ని అధికారంలో భాగ‌స్వామ్యం కావాల‌ని తాను కోరుకోవ‌డం లేద‌ని చెప్పుకొచ్చారు. విదేశాల నుంచి రాహుల్ రాగానే ఆయ‌న్ను వెళ్లి ఇబ్బంది పెట్ట‌లేన‌ని కూడా ముక్తాయించారు.  దీనంత‌టిని బ‌ట్టిచూస్తే డీకే త‌న త‌ర‌ఫు అటెంప్ట్ లు అన్నీచేసి ఫలితం కోసం వేచి చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక్క‌డ పార్టీ ప‌ర‌మైన ఆటంకాలేంట‌ని చూస్తే సిద్ధూని తొలగిస్తే ఒక స‌మ‌స్య‌. ఆయ‌న వ‌ర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా సామాజిక వ‌ర్గాలు పార్టీప‌ట్ల వ్య‌తిరేకత‌ను పెంచుకుంటాయి. ఇక డీకేని నిర్ల‌క్ష్యం చేస్తే.. క‌ష్ట‌ప‌డ్డ వారికి అంద‌లం ద‌క్క‌ద‌న్న సంకేతం వెళ్తుంది. దీంతో అధిష్టానం కూడా సందిగ్దావ‌స్థలో ఉన్నట్లు తెలుస్తోంది.

మాటకు కట్టుబడి.. పవన్ ఇప్పటం పర్యటన

మాట తప్పను, మడమ తిప్పను అని పదే పదే చెప్పుకున్న జగన్ అధికారం దక్కి మాట నిలుపుకునే అవకాశం వచ్చినప్పుడు ముఖం చాటేశారు. ప్రజల కష్టాల సంగతి సరే, వారి ముఖం చూడటం కూడా ఇష్టం లేదన్నట్లుగా రోడ్లకు ఇరువైపులా పరదాలు కట్టుకుని మరీ పర్యటలను సాగించారు. అందుకు భిన్నంగా జనసేనాని పవన్ కల్యాణ్ మాటకు కట్టుబడి నడుచుకుంటున్నారు. తాను అధికారంలో లేనప్పుడు ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేర్చారు.  విషయమేంటంటే.. 2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు. ఆ మాటను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో నిలబెట్టుకున్నారు.  బుధవారం (డిసెంబర్ 24) ఆయన ఇప్పటం గ్రామంలో పర్యటించారు.  ఈ పర్యటనలో భాగంగా ఆయన బండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లారు. ఆమె తన కష్టాలను పవన్ కు కన్నీటితో తెలియజేశారు. గతంలో ఇప్పటంలో పర్యటించిన సమయంలో పవన్  క ల్యాణ్ ఆమెకు ధైర్యం చెప్పారు. తాను తిరిగి వస్తాననీ, ఖచ్చితంగా ఆదుకుంటాననీ ఆమెకు మాట ఇచ్చారు. ఈ పర్యటనలో తాను నాడు ఆమెకు ఇచ్చిన హామీని నెరవేర్చారు.  నాగేశ్వరమ్మకు ఆమె ఇంటి పెద్దకొడుకుగా తాను అండగా నిలుస్తానని మాట ఇచ్చారు. అన్నట్లుగానే తన జీతం నుంచి ఆమెకు నెలనెలా ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. అలాగే మూగవాడైన నాగేశ్వరమ్మ మనవడి చదువుకు అవసరమైన ఆర్థిక సాయం అందించడమే కాకుండా, చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం కూడా ఇప్పిస్తానని చెప్పారు. ఇక అనారోగ్యంతో బాధపడుతున్న నాగేశ్వరమ్మ కుమారుడి వైద్యం కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటం గ్రామానికి వచ్చి పవన్ ఆత్మీయత చాటారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక జనసేన శ్రేణులైతే పవన్ కల్యాణ్ ది రాజకీయ పర్యటగా కాక బాధ్యత కలిగిన నేతగా పవన్ కల్యాణ్ మానవత్వాన్ని చాటుకున్న తీరుగా అభివర్ణిస్తున్నారు. 

మాజీ మావోల కొత్త పొలిటికల్ పార్టీ?

ఆయుధాలను విసర్జించి లొంగిపోయిన మావోయిస్టులు ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. నక్సల్ రహిత భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఆయుధాలు విడిచి లొంగిపోయిన మావోయిస్టుల సంఖ్య ఆరు వేలకు పైగానా ఉంటుంది. ఇలా లొంగిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నారు. వారు ఆయుధాలు విడిచి లొంగిపోవడమే కాకుండా, ఇంకా ఉద్యమంలో కొనసాగుతున్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలంటూ పిలుపు కూడా ఇచ్చారు. సాయుధ పోరాటానికి కాలం చెల్లిందని ప్రకటించడమే కాకుండా జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి శాంతియుత మార్గాన్ని అనుసరించాలని చెప్పారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయంగా ముందుకు వెడతామని ఆయన అన్న మాటలు మాజీ మావోయిస్టులు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న చర్చకు దారి తీసింది.  లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, తక్కెళ్ల పల్లి వాసుదేవరావు తదితరుల నేతృత్వంలో ఒక కొత్త రాజకీయపార్టీ ఆవిర్భవించే అవకాశం ఉందని పరిశీలకులు సైతం వారి ప్రకటనలు ఉటంకిస్తూ విశ్లేషిస్తున్నారు. భారత రాజ్యాంగానికి లోబడే వీరు ఏర్పాటు చేసే కొత్త రాజకీయ పార్టీ పని చేసే అవకాశాలున్నాయంటున్నారు.  ఇటీవల మల్లోజుల వేణుగోపాల్ ఒక జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ మావోల కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.   మరో సారి ఆయుధాలు చేపట్టే ప్రశ్నే లేదన్న ఆయన ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటామని విస్పష్టంగా చెప్పారు.  ఆపరేషన్ కగార్ తరువాత మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు, కీలక అగ్రనేతలు సహా దాదాపు ఆరువేల మంది లొంగిపోయిన సంగతి తెలిసిందే. లొంగుబాటు తరువాత కూడా వీరంతా ఒకరితో ఒకరు టచ్ లోనే ఉణ్నారంటున్నారు. పైగా లొంగిపోయిన వారంతా ప్రస్తుతం వేర్వేరు రాష్ట్రాలలో పోలీసు కేంద్రాలలోనే ఉన్నారు. కేంద్ర హోంశాఖ నిర్దేశించిన గడువు ముగిసిన తరువాత వీరంతా జనజీనవ స్రవంతిలోకి వస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మల్లోజుల మాటలు మాజీ నక్సల్స్ కోత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారన్న అభిప్రాయం కలిగేలా చేశారు.  మావోయిస్టులు కొత్త రాజకీయ పార్టీ అంటూ ప్రారంభిస్తే.. వారి మేనిఫెస్టో ఎలా ఉంటుంది? గతంలో తిరస్కరించిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానానికి అనుగుణంగా వీరు తమ సిద్ధాంతాలకు ప్రజలలో ఎలా ప్రాచుర్యం కల్పిస్తారు అన్నది వేచి చూడాల్సిందే. 

దానం నాగేందర్ రాజీనామాకు రెడీ అయిపోయారా?

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్  అనర్హత వేటుకు సిద్ధమైపోయారా అన్నఅనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేగా విజయం సాధించిన దానం నాగేందర్.. ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరి.. సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా సికిందరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికలో ఆయన పరాజయం పాలయ్యారు. అయితే తన అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై  అనర్హత వేటు వేలాడుతోంది. మామూలుగా  పార్టీ ఫిరాయింపుల విషయంలో ఆధారాల సేకరణకు సమయం పడుతుంది. అయితే దానం విషయంలో  మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే   కోర్టులో , అలాగే  స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకూ ఆయన స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ లో లేననీ, తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ దానం నాగేందర్ కుండ బద్దలు కొట్టేశారు. అంతే కాంకుండా జీహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలవబోతోందన్నారు. ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ జీహెచ్ఎంసీలో 300 స్థానాలలో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ అనర్హత వేటుకు సిద్ధమైపోయారా, లేక నేడో రేపో తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారా? అన్న చర్చ ప్రారంభమైంది.   ఇలా ఉండగా పరిశీలకులు మాత్రం దానం నాగేందర్ స్పీకర్ అనర్హత వేటు వేసే వరకూ ఆగకుండా అంతకు ముందే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయంటున్నారు. ఆయన రాజీనామా చేస్తే ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం తథ్యం.  అప్పుడు కాంగ్రెస్ తరఫున మళ్ళీ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఎన్నికవ్వాలన్నది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందంటున్నారు.  

ఫోన్ టాపింగ్ కేసులో పెన్ డ్రైవ్ ప్రకంపనలు

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును కొత్త సిట్ చేపట్టిన తరువాత కీలక పరిణామాలు సంభవిస్తున్నాయి. కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా సిట్ చేతికి చిక్కిన ఒక పెన్ డ్రైవ్ ప్రకంపనలు సృష్టిస్తున్నది.  ఆ పెన్ డ్రైవ్ ఆధారంగా ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని దర్యాప్తు అధికారులు బావిస్తున్నాయి.  మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు.   ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్   ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ కేసులో ప్రభాకర్ రావు తన వాంగ్మూలంలో పదేపదే మాజీ డిజిపి మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రస్తావిం చడంతో అప్పటికే సిట్ అధికారులు మాజీ డిజిపి ని విచారణ చేసి వాంగ్మూలం నమోదు చేశారు. అలాగే  ఫోన్ టాపింగ్ రివ్యూ కమిటీ లో సభ్యులైన మాజీ  సిఎస్ లు సోమేష్ కుమార్, శాంత కుమారి ఇతర అధికారులు తిరుపతి, శేషాద్రి లను కూడా  విచారించారు. ఇక  మంగళవారం  ఈ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారించాలని సిట్ నిర్ణయించింది. కెసిఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు కూడా నోటీసులు ఇవ్వడానికి సిట్ అధికారులు సిద్ధమవుతున్నట్లు  తెలుస్తున్నది.   ఇక బుధవారం(డిసెంబర్ 24) సిట్ విచారణలో వెలుగులోకి వచ్చిన  పెన్ డ్రైవ్ తీవ్ర కలకలం సృష్టిస్తున్నది.  ఈ కేసుకు సంబంధించిన ఈ పెన్ డ్రైవ్  కీలక ఆధారంగా మారను న్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు తన పదవీకాలంలో ఫోన్ టాపింగ్ కు సంబంధించిన కీలక వివరాలను ఈ పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసి ఉంచినట్లుగా సిట్ గుర్తించింది. ఈ పెన్ డ్రైవ్ లో వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ప్రధానంగా  రాజకీయ నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన ఫోన్ నెంబర్లతో పాటు ప్రొఫైల్స్ కూడా ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ పెన్ డ్రైవ్ డేటాను ప్రభాకర్ రావు ముందు ఉంచి సిట్ అధికారులు విచారిస్తున్నట్లు  తెలుస్తోంది.  సిట్ అధికారులు ఈ పెన్ డ్రైవ్ ద్వారానే ఫోన్ టాపింగ్ గురైన ఫోన్ నెంబర్ల ను ఇప్పటికే  గుర్తించారు. ఫోన్ టాపింగ్ వ్యవహారం కొనసా గుతున్న సమయంలో పోలీసుల చేతికి చిక్కకుండా ప్రభాకర్ రావు టీమ్ అన్ని ఆధారాలు ధ్వంసం చేసినా కూడా ఈ పెన్ డ్రైవ్ ప్రత్యేక దర్యాప్తు బృందం చేతికి చిక్కడం దర్యాప్తులో కీలక మైలురాయిగా మారింది. ఈ కేసు ఛేదించడానికి  పెన్ డ్రైవ్ సాలిడ్ ఎవిడెన్స్ అని సిట్ అధికా రులు చెబుతున్నారు.  ప్రభాకర్ రావు నుండి ఇంకా పూర్తి వివరాలు సేకరించేందుకు ఎల్లుండి వరకూ  విచారించడానికి సమయం ఉందని అధికారులు తెలిపారు.  

ప్రధాని పదవికి రాహుల్ అనర్హుడా?.. రాబర్ట్ వధేరా మాటల ఆంతర్యమేంటి?

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సొంత కుటుంబం నుంచే వ్యతిరేక సెగ తగులుతోందా? ఇటీవలి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం తరువాత ఇండీ కూటమి నేతలు రాహుల్ నాయకత్వంపై ఒకింత ఆసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా పలువురు నేతలు రాహుల్ నాయకత్వ సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాహుల్ సొదరి ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వధేరా కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. నేరుగా రాహుల్ పేరు ఎత్తకుండానే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  పార్టీలో ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వికి త‌న భార్య, వ‌య‌నాడ్‌  ఎంపీ ప్రియాంక గాంధీ అర్హురాల‌ంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక పెను చీలికకు దారి తీసే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.    రాబర్ట్ వధేరా.. ప్రియాంక వధేరా లోక్ సభలో బలమైన గళం వినిపించారనీ,  ఆమెకు ప్రధాన మంత్రి పదవి చేపట్టడానికి అవసరమైన అన్ని అర్హతలూ ఉన్నాయనీ అన్నారు. అక్కడితో ఆగకుండా, కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటిస్తేనే దేశంలో కాంగ్రెస్ కు ఆదరణ పెరుగుతుందని, అప్పుడే దేశంలో కాంగ్రెస్ విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకోగలుగుతుందనీ రాబర్ట్ వధేరా అన్నారు.  లోక్ సభ శీతాకాల సమావేశాల ముగింపు సందర్భంగా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే  కొందరు  ఎంపీల నంచి కూడా వచ్చిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రాబర్ట్ వధేరా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయమనీ, వాటితో పార్టీకి సంబంధం లేదంటూ కొందరు సీనియర్లు వివాదం పెరగకుండా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇక ప్రియాంక వధేరా గాంధీ అయితే, తన భర్త వ్యాఖ్యలపై స్పందించకుండా మౌనం వహించారు.  దీనిపై రాహుల్ ఏ విధంగా స్పందిస్తారన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

వైఎస్ కుటుంబం మినీ క్రిస్మస్ వేడుకలు.. షర్మిల ఎక్కడ?

వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం క్రిస్మస్ వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంది. ఆ కుటుంబం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవడమన్నది చాలా కాలంగా వస్తున్న సంప్రదాయం.  పులివెందులలోని తమ పూర్వీకుల ఇంట్లో కుటుంబ సభ్యులంతా కలిసి ఈ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఈ సారి కూడా ఆ సంప్రదాయం కొనసాగింది. పులివెందులలోని వైఎస్ నివాసంలో   వైఎస్ కుటుంబం మినీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.  షర్మిల  వినా ఈ వేడకకు  వైఎస్ కుటుంబంలోని దాదాపు అందరూ హాజరయ్యారు. జగన్, ఆమె తల్లి విజయమ్మా చాలా కాలం తరువాత ఒకే కార్యక్రమంలో పాల్గొనడం ఆసక్తి కలిగించింది. అయితే వారిరు వురూ దూరందూరంగా కూర్చోవడంపై కూడా చర్చ జరుగుతోంది.  ఇందుకు సంబంధించిన గ్రూప్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే ఈ వేడుక ఎప్పుడు జరిగింది? అన్న విషయంపై స్పష్టత లేదు.  ఆ ఫొటో ఈ ఏడాది జరిగిన క్రిస్మస్ వేడుకలకు సంబంధించినదా, పాతదా అన్న అనుమానాన్ని నెటిజనులు వ్యక్తం చేస్తున్నారు.   మొత్తం మీద సామాజిక మాధ్యమంలో ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ షర్మిల ఎక్కడ అంటూ నెటిజనులు పోస్టు చేస్తున్నారు.  ప్రస్తుతం జగన్ పులివెందుల పర్యటనలో ఉండటం ఈ ఫొటో తాజాదే అయి ఉంటుందని భావించవ చ్చునని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద వైఎస్ జగన్, షర్మిల మధ్య దూరం తరగలే దనడానికి ఈ ఫొటో నిదర్శనంగా ఉందని చెబుతున్నారు. ఎందుకంటే జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల షర్మిల ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం, అందుకు ధాంక్యూ షర్మిలమ్మా అంటూ జగన్ రిప్లై ఇవ్వడంతో ఇరువురి మధ్యా సయోధ్య ఏర్పడిందన్న చర్చ ఇటీవల జోరుగా సాగింది. ఇప్పుడు తాజాగా పులవెందులలో వైఎస్ కుటుంబ సభ్యులు జరుపుకున్న మినీ క్రిస్మస్ వేడుకల్లో షర్మిల కనిపించకపోవడం వీరి మధ్య విభేదాలపై మరో సారి చర్చకు తెరలేపింది.