పిరమిడ్ బాబా రాసలీలలు !
posted on Jan 3, 2013 @ 11:41AM
పిరమిడ్ బాబా రాసలీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బహిరంగంగా ఆయన మహిళల పట్ల వ్యవహరించిన తీరుకు సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కడ్తాల్ లో ప్రపంచ మహాసభలు నిర్వహించిన, తాత వయసున్న ఆయన మహిళలను వశపరచుకొని అదే ప్రాంతంలోని తన రహస్య గదిలో గ్రూప్ సెక్స్ చేసినట్లు కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే, మహిళలు మాత్రం తమ పరువు పోతుందనే భయంతో బయటపడటం లేదని తెలుస్తోంది. పవిత్రమైన ధ్యాన మహాసభల పేరుతో సుభాష్ పత్రీ అనే పేరు గల ఆ బాబా బహిరంగంగానే మహిళల పట్ల వికారపు చేష్టలకు పాల్పడ్డాడు. ఈ విషయంలో పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర హోం శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కూడా ఈ విషయంఫై విచారణ జరపాలని ఆదేశించారు. ఓ న్యాయవాది వేసిన పిటీషన్ ఫై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ కూడా బాబా అక్రమాలఫై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ లను ఆదేశించింది.
బాబా చీకటి కోణాలను ప్రసారం చేసిన ఓ టెలివిజన్ చానెల్ ఫై ఆయన అనుచరులు దాడి చేసి ఆ చానెల్ వాహనాన్ని దగ్దం చేశారు. అయితే, తనను అరెస్టు చేస్తారనే భయంతో తలదాచుకోవడానికి పిరమిడ్ బాబా బెంగళూరు వెళ్ళినట్లు తెలుస్తోంది.