అక్బరుద్దీన్ ఫై ఎంఎల్ఏ గా అనర్హత వేటు ?

 

 

 

ఇటీవల నిర్మల్ లో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగించిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసిఫై ఎంఎల్ఏ గా కొనసాగే అర్హత లేకుండా వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. తాను చేసిన ప్రసంగాల ద్వారా ఆయన రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా వ్యవహరించారని శాసన సభ నైతిక విలువలు, ప్రవర్తన నియమావళి సంఘం ప్రాధమికంగా అభిప్రాయపడింది.

 

బందరు సత్యానంద రావు అధ్యక్షతన నిన్న ఈ కమిటీ అసెంబ్లీ ప్రాంగణంలో సమావేశం అయింది. అక్బర్ చేసిన ప్రసంగాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకు వెళ్లి ఆయనఫై చర్య తీసుకోవాలని సిఫార్సు ఆ సంఘం భావిస్తోంది. ఈ కమిటీ తన నిర్ణయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకు వెళ్ళిన సమయంలో తనకు కూడా ఈ విషయంలో ఫిర్యాదులు అందాయని మనోహర్ అన్నట్లు తెలిసింది. అయితే, ఇతర రాష్ట్రాల్లో ఉన్న నియమావళిని కూడా పరిశీలించాలని ఈ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. ఏదేని సభ్యుని ప్రవర్తన ఆధారంగా చర్య తీసుకోవాలని సిఫారసు చేసే అధికారం తమ కమిటీకి ఉందని బండారు అన్నారు.

 

అయితే, అక్బర్ పేరును నేరుగా ప్రస్తావించకుండా ఓ సభ్యుడు చేసిన మత విద్వేషాల ప్రసంగాలు చర్చకు వచ్చాయని బండారు అన్నారు. ఏ సభ్యుడు అయినా, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగేలా వ్యవహరిస్తే, ఆ సభ్యుని శాసనసభ్యత్వం రద్దు చేయాలని సిఫారసు చేసే అధికారం తమ కమిటీకి ఉందని బండారు అన్నారు.

Teluguone gnews banner