జగన్ అడ్డా టీడీపీ కంచుకోట కాబోతుంది
posted on Aug 9, 2025 @ 8:54PM
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత అడ్డా పులివెందుల టీడీపీ కి కంచుకోట కాబోతోందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. శనివారం పులివెందులలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీడీపీ కుటుంబ సభ్యులంతా జడ్పీటీసీ ఎన్నికల్లో కలిసి పాల్గొంటున్నారని తెలిపారు. కడప, పులివెందులకు ఐదేళ్లలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కు ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. కేంద్ర ప్రభుత్వం కొప్పర్తికి రూ.1,500 కోట్లు ఇచ్చింది. ఆ డబ్బును దారి మళ్ళించారని ఆరోపించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో దోచుకోవడంతోనే సరిపోయింది అన్నారు. వైసీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసిన ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలుపు ఖాయమన్నారు. మరోవైపు పులివెందుల ఓటర్లలో ఆనందం వెల్లవిరించింది.
1995 తరువా తొలిసారి జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటేయబోతున్న సంతోషం పండగ వాతావరణం గ్రామాల్లో తలపిస్తున్నాయి. పులివెందుల్లో తొలి నుంచి వైఎస్ కుటుంబం ఆదిపత్యం చెలాయిస్తున్నాయి. తొలిసారి వైఎస్ కోటలో బీటెక్ రవి ఎమ్మెల్సీగా గెలుపొందారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాంభూపాల్ రెడ్డి విజయం సాధించారు. తొలిసారి టీడీపీ నేతల్లో గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఈనెల 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. పులవెందులలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయినా టీడీపీ, వైసీపీ మధ్యే పోటీ నెలకొంది. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి, వైసీపీ నుంచి హేమంత్‌రెడ్డి బరిలో ఉన్నారు.
ఈ ఎన్నికలు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో రెండు కూడా తమ ఫోకస్ అంతా అక్కడే పెట్టాయి. ఎంపీ అవినాశ్‌రెడ్డి వైసీపీ గెలుపు బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి , ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి టీడీపీ గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. పులివెందులలో వరుసగా రెండురోజుల పాటు టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పులివెందులలో ఉప ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తుంది