మారియన్ బయోటెక్ లో ఉత్పత్తి నిలిపివేత
posted on Dec 30, 2022 @ 2:33PM
ఉజ్బెకిస్థాన్ లో 18 మంది చిన్నారుల మరణాలకు కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న నోయిడా ఫార్మా కంపెనీ మారియన్ బయోటెక్ లో ఉత్పత్తి నిలిచిపోయింది. కేవలం దగ్గు మందులే కాకుండా అన్ని రకాల మందుల ఉత్పత్తి నిలిచిపోయింది. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీవో) మారియన్ బయోటెక్ ప్లాంట్ ను తనిఖీ చేసి, ఔషధ తయారీని నిలిపివేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. కాగా మారియన్ బయోటెక్ లో ఉత్పత్తిని నిలిపివసినట్లు ఆ సంస్థ కూడా ధృవీకరించించింది.
మారియన్ బయోటెక్ కు చెందిన డాక్-1 అనే దగ్గు మందును తీసుకున్న 18 మంది మరణించినట్టు ఉజ్బెకిస్థాన్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ, ఔషధ నియంత్రణ, ప్రమాణాల మండళ్లు స్పందించాయి. డాక్-1 దగ్గు మందు శాంపిళ్లను రీజినల్ డ్రగ్ లేబరేటరీకి పంపించినట్టు మాండవీయ ప్రకటించారు. వచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. దగ్గు మందు సిరప్‌లో కలుషిత ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్టు లేబరేటరీ పరీక్షల్లో వెల్లడైనట్లు ఇప్పటికే ఉజ్బెకిస్థాన్ ప్రకటించింది. దగ్గు మందులో ఇథిలిన్ గ్లైకాల్ ఉన్నట్టు ల్యాబ్ టెస్టుల్లో తేలింది. దీంతో డాక్ 1 మ్యాక్స్ ట్యాబ్లెట్లు, సిరప్ ను అన్ని మందుల షాపుల నుంచి విత్ డ్రా చేస్తున్నట్లు పేర్కొంది.
2022లో ఇలా భారత్ లో తయారైన దగ్గు మందు సేవించి చిన్నారులు మరణించటం ఇదే మొదటి సారి కాదు. ఇంతకు ముందు అంటే అక్టోబర్ లో అక్టోబర్‌లో గాంబియాలో 70 మంది చిన్నారులు మేడ్ ఇన్ ఇండియా కాఫ్ సిరప్ కారణంగా మరణించారు. దీనికి కారణమైన హర్యానా లోని మైడెన్ ఫార్మాను అప్పట్లో కేంద్రం సీజ్ చేసింది కూడా. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
అయితే ఇప్పటి వరకు భారతీయ కంపెనీ దగ్గు మందు కారణంగా పిల్లలు మరణించినట్లు అధికారిక ధృవీకరణ లేదు. తాజాగా ఉజ్బెకిస్థాన్‌లో దగ్గు మందు తాగి చిన్నారులు మృతి చెందడంపై తదుపరి పరిశోధనలకు సహకరించేందుకు డబ్ల్యుహెచ్ ఓ చర్యలకు ఉపక్రమించింది. చ